mother cat slapped Baby cat
Cat heart touching Viral Video : అమ్మంటే అమ్మే. మాతృత్వానికి మనిషి, జంతువు అనే తేడా లేదు. కన్నబిడ్డలు కాసేపు కనిపించకపోతే తల్లడిల్లిపోతుంది తల్లి హృదయం. కంగారుపడిపోతుంది. నా బిడ్డకు ఏం జరగకుండా చూడు భగవంతుడా అంటూ వేడుకుంటుంది. తల్లిమనస్సుకు మనిషి జంతువులు అనే తేడా లేదు. పిల్లి, కుక్కు, ఆవు, గేదె ఇలా ఏ జంతువైనా తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. బిడ్డకు కంటికి కనిపించకపోతే తల్లడిల్లిపోతాయి.
అటువంటి పరిస్థితిలోనే ఓ పిల్లి తన కూన కనిపించపోవటంతో అల్లాడిపోయింది. ఎక్కడెక్కడో వెదికింది. ఎట్టకేలకు పిల్లికూన కనిపించిది. అంతే మియ్యావ్ అంటూ వాటి భాషలోనే అరుచుకున్నాయి. పిల్లి కూన కనిపించగానే ఆ తల్లిపిల్ల ఎక్స్ ప్రెష్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అది కదా తల్లి అంటే అనేలా ఉంది.పైగా అప్పటి వరకు బిడ్డ కనిపించకపోవటంతో ఆందోళనపడిన ఆ తల్లిపిల్లి పిల్లి కూన కనిపించగానే కనిపించిన ఎక్స్ ప్రెషన్ తో పాటు కాస్త కోపంగా పిల్లికూన చెంప మీద ఒక్కటిచ్చింది. తన ముందు కాలుతో పిల్లికూనను ఒక్క దెబ్బ కొట్టింది. ఆ దెబ్బలో బిడ్డమీదున్న ప్రేమ..కనపించలేదనే ఆందోళన..క్షేంగా కనిపించిన ఆనందం..అన్ని చక్కగా అర్థమవుతున్నాయి.. ఆ పిల్లికే మాటలు వచ్చి ఉంటే..‘‘ఎక్కడికెళ్లిపోయావే నీకోసం ఎంత వెదికానో తెలుసా..? ఎంత భయపడిపోయానో తెలుసా’’ అనే అర్థం ఈ వీడియో ఆ పిల్లి మొహంలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.
ఈ వీడియోను చూస్తే ఏ జీవి అయినా తల్లి తల్లే కదా అని కచ్చితంగా అనిపిస్తుంది. బిడ్డ కనిపించగానే ఆ తల్లిపిల్లికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు..పిల్లి కూన చెంపమీద ఒక్కటిచ్చి ఆ తరువాత బుజ్జి పిల్లిని నోట కరచుకుని తీసుకెళ్లిపోయింది. ఈ వీడియో నిజంగా చాలా చాలా బాగుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి లైకులతోపాటు కామెంట్ల వర్షం కురుస్తున్నది. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదతోపాటు పలువురు నెటిజన్‌లు ట్విటర్‌లో ఉన్న ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తున్నారు. మరి ఈ హార్ట్ టచ్చింగ్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండీ..
A lost kitten and her mother found her, she slapped her and took her home. ?pic.twitter.com/UNLA0LxOXC
— Figen (@TheFigen_) September 28, 2023