Auto Driver Free Tamatoes : అరుణ్ ఓ మంచి ఆటో డ్రైవర్ .. టమాటాలు ఫ్రీతో పాటు ఇతని ఉచితాల లిస్టు తెలుసుకోవాల్సిందే..

టమాటాలు ఫ్రీ అంటూ వినూత్నంగా వ్యాపారాలను పెంచుకుంటున్నారు వ్యాపారులు. అలాగే ఓ ఆటో డ్రైవర్ కూడా టమాటాల ట్రెండ్ ను ఫాలో అవుతు తన ఆటో ఎక్కితే టమాటాలు ఫ్రీగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఈ ఆటో డ్రైవర్ కేవలం గిరాకీ పెంచుకోవటానికి కాదు ఈ ప్రకటన చేసింది. సామాజిక బాద్యత కలిగిన ఓ మంచి ఆటో డ్రైవర్ కూడా..మరి ఆ ఆటో డ్రైవర్ ఉచితల లిస్టు చాలానే ఉంది..

Chandigarh Auto driver Arun Free Tamatoes : అతనో ఆటో డ్రైవర్. ట్రెండ్ కు తగినట్లుగా ఆఫర్లు ఇచ్చి గిరాకీ పెంచుకుంటాడు.అలాగని పక్కా కమర్షియల్ వ్యక్తి అనుకోవద్దు. కాస్త క్రీడా స్పృహ..ఇంకాస్త దేశభక్తి..మరికాస్త సామాజిక బాధ్యత కలిగిన మంచి ఆటో డ్రైవర్. అంతేకాదు ట్రెండ్ ను పక్కాగా ఫాలో అవుతుంటాడు.అలా తన ఆటో గిరాకీని పెంచుకుంటుంటాడు.అతని పేరు అరుణ్. పంజాబ్‌ (Punjab)లోని చండీగఢ్‌ (Chandigarh)కు చెందిన వ్యక్తి అరుణ్. తాజాగా టమాటాల ధరల భారీ స్థాయిలో పెరిగిపోవటంతో టమాటాల ట్రెండ్ ను ఫాలో అవుతు తన ఆటోలో ప్రయాణిస్తే కిలో టమాటాలు ఫ్రీగా ఇస్తానంటు ప్రకటించాడు. దాని కోసం ఓ ఫ్లెక్సీ తయారు చేసి ఆటో వెనుక ఏర్పాటు చేశాడు.

తన ఆటోలో ప్రయాణించే వారికి ఉచితంగా కిలో టమాటాలు ఇస్తానని ప్రకటించిన అరుణ్ ఆ మెలిక కూడ పెట్టాడు. అంటే షరతు పెట్టాడు. తన ఆటోలో కనీసం ఐదుసార్లు ప్రయాణించిన వారికి మాత్రమే టమాటాలు ఉచితంగా ఇస్తానని చెబుతున్నాడు. భలే ఉంది కదా మెలిక. అరుణ్‌ గత 12 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టమాటాలు రూ.150 నుంచి రూ.200ల వరకు ధర పలుతుండటంతో ఇటువంటి ఆఫర్ ప్రకటించానని చెప్పాడు. దీనిపై అరుణ్ మాట్లాడతు.. ‘‘నాకున్న ఏకైక ఆదాయమార్గం ఆటోనే. దీని ద్వారా నేను, నా కుటుంబం జీవించాలి. అలాగే నా స్థాయిలో నా కష్టమర్లకు సేవలు చేయాలి..అందుకే ఇలాంటి ప్రకటన చేశా..దీంతో గిరాకీ పెరుగుతుంది నా కష్టమర్లకు నా వంతుగా అధిక ధరలు పలుకుతున్న టమాటాలు ఇచ్చినట్లు అవుతుంది’’అని తెలిపాడు.

Tomato Prices : విమానం టికెట్ కొంటే టమాటాల ఫ్రీ .. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు, టమాటాలా మజాకానా..!

కాగా అరుణ్ కు క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. భారతీయకులకు సహజంగా ఉండే పాకిస్థాన్ తో భారత్ మ్యాచ్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. అందుకే క్రికెట్ ట్రెండ్ ను కూడా ఫాలో అయిపోతు పాకిస్థాన్‌తో త్వరలో జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే.. చండీగఢ్‌లో ఐదు రోజులపాటు తన ఆటోలో ఉచిత ప్రయాణం అందిస్తానని ప్రకటించాడు. అలాగే త్వరలో క్రికెట్ ప్రపంచకప్ రానున్న నేపథ్యంలో భారత్ – పాక్ మధ్య జరిగే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించాలని కోరుకున్నాడు. అలా భారత్ గెలిస్తే.. చండీగఢ్‌లో ఐదు రోజులపాటు తన ఆటోలో ఎక్కిన వారికి ఉచిత ప్రయాణం అందిస్తానని వెల్లడించాడు.

గతంలో కూడా అరుణ్ ఇలాంటి ఉచిత ప్రయాణాలు ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సమయంలోనూ చండీగఢ్‌లో ఉచితంగా ఆటో సర్వీసులు అందించాడు. అంతేకాదు..ఆటోలో గర్భిణీలు, ప్రమాదంలో గాయపడిన వారికి ఉచిత ప్రయాణం అందిస్తుంటాడు. అతని పెద్ద మనస్సును గుర్తించిన చండీగఢ్‌ పోలీసులు అరుణ్ ను సత్కరించారు కూడా.అరుణ్ తన ఆటోలో భారత సైనికులను చండీగఢ్‌లో ఉచితంగా ఎక్కడికైనా తీసుకువెళ్తాడు.

Govt Tomato Sale : సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం టమాటాల అమ్మకాలు .. కిలో ఎంతంటే..?

 

 

 

ట్రెండింగ్ వార్తలు