Automatic Liquor Machine : చెన్నైలో ఎనీటైమ్ మద్యం (ATM) మెషిన్లు .. బ్రాండ్ సెలెక్ట్ చేసి డబ్బులు చెల్లిస్తే చేతికి మందుబాటిల్

డబ్బుల కోసం ఏటీఎం మిషన్లను చూశాం. ఎనీటైమ్ ఇడ్లీల మిషన్ గురించి విన్నాం. హైదరాబాద్ లోనే ఎనీటైమ్ బాగ్ మిషన్లను చూశాం. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనీటైమ్ మందు మిషన్ గురించి తెలుసా?

Automatic Liquor Machine

Automatic Liquor Machine : ATM అంటే Automated teller machine. డబ్బుల కోసం ఏటీఎం మిషన్లను చూశాం. ఎనీటైమ్ ఇడ్లీల మిషన్ గురించి విన్నాం. హైదరాబాద్ లోనే ఎనీటైమ్ బాగ్ మిషన్లను చూశాం. కానీ ఎనీటైమ్ మందు మిషన్లును బహుశా ఎక్కడా చూసి ఉండరు. అటువంటి ఎనీటైమ్ మందు బిషన్లను చూడాలంటే చెన్నై వెళ్లాల్సిందే.

తమిళనాడు ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలూ మద్యం కొనుగోలు చేసేందుకు ఈ మెషిన్లను ఏర్పాటు చేసింది. చెన్నై నగరంలోని ఓ మాల్ లో తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టాస్మాక్) (Tasmac)షాపులో తొలిసారిగా అన్నానగర్ లో (శుక్రవారం) ఈ మద్యం విక్రయ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ యంత్రానికి సదరు మందుబాబుకి ఇష్టమైన బ్రాండ్ ఎంపిక చేసుకుని డబ్బులు చెల్లిస్తే చేతికి మందు బాటిల్ అందుతుంది.

తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఈ మెషిన్ల నుంచి ఎనీ టైం మందు కొనుక్కోవచ్చు. అచ్చంగా ఏటీఎంలానే పనిచేసే ఈ మెషిన్లలో ముందుగా పైన కనిపించే బ్రాండ్లలో కావాల్సిన బ్రాండ్ ను ఎంపిక చేసుకోవాలి..వెంటనే దాని ధరను మెషిన్ చూపిస్తుంది. ఆ మొత్తాన్ని డిజిటల్ (ఆన్ లైన్ లో) రూపంలో చెల్లిస్తే.. మెషిన్ కింది బాగంలో నుంచి సీసా బయటకు వస్తుంది. ఈ ఎనీటైమ్ మందు మిషన్ కు మంచి స్పందన వస్తే మరిన్ని మెషిన్లు ఏర్పాటు చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. మెషిన్ లోంచి బాటిల్ వస్తుంది కాబట్టి కూలింగ్ ఉండదనుకుంటే పొరపాటే దీంట్లో కూలింగ్ సిస్టం కూడా ఉందట..అంటే బీర్ లాంటివాటికన్నమాట..మరి మందుబాటిల్ బయటకు ఎలా వస్తుందో ఈ వీడియోపై ఓ లుక్కేయండీ..