Blind Village
Blind Village : అదొక అందమైన గ్రామం. చుట్టు పచ్చని కొండలతో ప్రకృతి అందాలతో కనువిందు చేసే అందాల గ్రామం. కానీ ఆ అందాల్ని కళ్లారా చూసి ఆనందించలేని దురృష్టవంతులు ఆ గ్రామస్తులు. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవ్వరికి కంటి చూపు కనిపించదు. పుట్టినప్పుడు బాగానే ఉంటారు. బాల్యంలోను బాగానే కంటిచూపు కనిపిస్తుంది. కానీ వయస్సు పెరిగేకొద్దీ వారికి కంటి చూపు పోతుంది. అంధులుగా మారిపోతారు. ఆగ్రామంలో మనుషులకే కాదు జంతువులకు కూడా కంటి చూపు కనపించదు. వినటానికి వింతగా ఉన్నా పాపం ఎంతోకాలంగా ఆ గ్రామస్తులంతా అంధులుగా జీవితాలు వెళ్లదీస్తున్నారు. కర్రల సహాయంతో నడుస్తుంటారు. ఈ గ్రామంలో మనుషులకు, జంతువులకు కూడా కంటిచూపు కనిపించకుండాపోవటానికి కారణం ఓ ‘చెట్టు’ అంటారు గ్రామస్తులు..!
రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ వెల్కమ్ టూ మై వరల్డ్ అంటాడే అచ్చం అలాగే ఆ గ్రామస్తులంతా చీకటిలో జీవిస్తున్నారు. పగలు రాత్రి వారికి చీకటే. చీకటి నిండిన జీవితాలతో రోజులు అలాగే గడిపేస్తున్నారు. ఆ గ్రామం పేరు అందుకే ఆ గ్రామాన్ని అంధుల గ్రామం (Blind Village)అంటారు. మెక్సికోలో ఉందీ అంధుల గ్రామం. ఈ గ్రామంలో ఏ ఒక్కరికి కంటిచూపు కనిపించదు. ఆఖరికి జంతువులు కూడా చూపు కనిపించదు. ఆ గ్రామం పేరు ‘టిల్టెపాక్’. వీరింతా గిరిజనులు. ఇక్కడ పుట్టిన బిడ్డలు మొదట్లో బాగానే ఉంటారు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ కొంచెం కొంచెంగా చూపు కోల్పోతుంటారు. అలా కొన్నాళ్లకు చూపు పూర్తిగా కోల్పోతుంటారు. దీంతో ప్రపంచంలోనే అంధుల గ్రామంగా పేరొందింది.
ఈ పరిస్థితికి కారణమేంటి..? అని ఎవరైనా అడిగితే ఆ గ్రామస్తులు ఓ చెట్టువల్లేనని చెబుతారు. తమ గ్రామంలో శాపానానికి గురైన లావాజులా అనే చెట్టు ఉందని ఆ చెట్టును చూస్తే కంటిచూపు పోతుందని చెబుతుంటారు. ఆచెట్టును చూసిన మనుషులకైనా, జంతువులకైనా కంటిచూపు పోతుందని చెబుతున్నారీ అడవిబిడ్డలు. కానీ అది కేవలం వారి అమాయకత్వమేనంటారు శాస్త్రవేత్తలు. అంధుల గ్రామం గురించి శాస్త్రవేత్తలు మాట్లాడుతు..ఈ గ్రామంలో ఓ ప్రత్యేక జాతులకు సంబంధించిన విషపూరిత ఈగలే వల్లే కంటిచూపు పోవటానికి కారణమి చెబుతున్నారు.విషపూరితమైన ఈగలు కుట్టడం వల్ల క్రమంగా అక్కడ జీవించే మనుషులు, జంతువులు చూపు కోల్పోతున్నారని చెబుతున్నారు.
మరి ఇంత కాలంలో చూపు కోల్పోతున్న గ్రామస్తుల గురించి ఆదేశ ప్రభుత్వం ఏమి చేయటంలేదా ..? అంటే చాలా ప్రయత్నాలే చేసింది. ఆ ప్రాంతం నుంచి వారిని వేరే ప్రాంతానికి తరలించాలని మెక్సికో ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. చక్కటి వసతులు ఏర్పాటుచేస్తామని చెప్పినా వారు వినలేదు. సాధారణంగా గిరిజనులు వారి ప్రాంతాలను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లటానికి ఇష్టపడరు. ఈ గ్రామస్తులు కూడా అంతే. వారంతా గిరజనులే.వారి పూర్వీకుల కాలం నుంచి అక్కడే జీవిస్తున్నారు. అందుకే వారు అక్కడినుంచి వేరే ప్రాంతానికి వెళ్లటానికి ఇష్టపడటంలేదు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు వినలేదు.
Pakistan Fuel Prices Hike : పాకిస్థాన్‌లో రూ.300 దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు
తాము ఇక్కడి వాతావరణానికే అలవాటుపడిపోయామని వేరే ఎక్కడా జీవించలేమని ఎక్కడికీ రామని తేల్చి చెప్పేసారు.దీంతో ప్రభుత్వం చేసిన ఏ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆ గ్రామంలోనే చీకటిలో జీవిస్తున్నారు. తమ అంధత్వానికి ఆ చెట్టే కారణమా? లేదా ఈగలే కారణమా లేక మరేదైనా కారణమా..? అనేది మాకు అనవసరం..ఇక్కడే పుట్టాం. ఇక్కడే జీవిస్తాం..ఎన్ని ఇబ్బందులైనా ఇక్కడే పడతాం వేరే చోటికి రాలేమని చెప్పేశారు. ఇది మా పూర్వీకుల నుంచి వస్తున్న గ్రామం ఇక్కడే మా జీవితాలను అని తేల్చి చెప్పటంతో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది. కానీ అక్కడి జనాలకు మాత్రం తమ అంధత్వానికి పరిష్కార మార్గం ఇక్కడే దొరుకుతుందని ఆశిస్తున్నామని గ్రామస్తులు చెబుతున్నారు.