China Company Fed Bitter Gourd To Employees
China Company Fed Bitter Gourd To Employees : అదొక కార్పొరేట్ కంపెనీ. ఉద్యోగులతో కాకరకాయలు ( bitter gourd) తినిపించింది. ఎందుకంటే అదొక పనిష్మెంట్ అట. ఇదేం పనిష్మెంట్ రా బాబు కటిక చేదుగా ఉండే ఈ కాకరకాయలు తినటమేంటి రా బాబూ అంటూ ఇష్టం లేకపోయినా ఉద్యోగులు కాకరకాయల్ని తిన్న ఫోటోలు..వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైలర్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు మరీ ఇంత శాడిజమా? అంటూ తిట్టిపోస్తున్నారు. ఇంతకీ సదరు కంపెనీ ఎందుకు అలా చేసిందంటే..పోటీ పెరుగుతున్న క్రమంలో ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయనందుకు ఇదే సరైన పనిష్మెంట్ అన్నదట..
కార్పొరేట్ కంపెనీ అంటే టార్గెట్స్ అనేవి సర్వసాధారణం. కార్పొరేట్ బ్యాంకులకు లోన్లు, క్రెడిట్ కార్డులు, డిపాజిట్లు చేయించటం వంటివి ఉంటాయి. అదే ఐటీ కంపెనీలైన ఇచ్చి టార్గెట్స్ కంప్లీట్ చేయాలి. ఇలా కార్పొరేట్ కంపెనీలకు టార్గెట్ అనేవి సర్వసాధారణంగా ఉంటుంటాయి. అలాగే చైనాలోని ఓ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగులకు అంటేనే పని ఒత్తిడి, టార్గెట్లు, షిఫ్టులు కామెన్ గా ఉంటాయి. ఇచ్చిన టార్గెట్స్ ఇచ్చిన టైమ్ కు కంప్లీట్ చేయాలని కఠినంగా చెబుతుంటాయి సదరు కంపెనీలు. లేదంటే ఇంక్రిమెంట్ ఉండవు. ప్రమోషన్లు ఉండవు..ఒక్కోసారి ఉద్యగం కూడా పోవచ్చు.
చైనా(China)లోని జియాంగ్సు ప్రావిన్స్ (Jiangsu province)లో ఉన్న ‘సుజౌ డానావో ఫాంగ్ చెంగ్ క్సీ ఇన్ఫర్మేషన్ కన్సల్టింగ్’(Suzhou Danao Fangchengshi Information Consulting) కార్పొరేట్ కంపెనీ.. టార్గెట్ పూర్తి చేయని తమ ఉద్యోగులకు విచిత్రమైన శిక్ష విధించింది. పచ్చి కాకరకాయలను తీసుకువచ్చి.. తాము ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయని ఉద్యోగులతో తినిపించింది.
దీంతో అటు పని పూర్తి చేయలేక..ఇటు కటిక చేదుగా ఉండే కాకరకాయలు తినలేక పాపం ఆ ఉద్యోగులు పడిన పాట్లు అన్నీ ఇన్నీకావు. దీనికి సంబంధించిన దృశ్యాలను జాంగ్ అనే ఉద్యోగి వీడియో తీసి సోషల్ మీడియాలో ఉంచడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వింత శిక్ష విధించిన కంపెనీపై నెటిజన్లు మండిపడుతున్నారు.
దీనిపై సదరు కంపెనీ యాజమాన్యాన్ని మీడియా ప్రశ్నించగా మొండిగా సమాధానం చెప్పింది. ఇది కంపెనీ రివార్డ్ అండ్ పనిష్‌మెంట్ విధానంలో భాగమని..ఉద్యోగులు జాబ్‌లో చేరడానికి ముందే ఇలాంటి వాటికి అంగీకరించారని యాజమాన్యం చెబుతోంది. ఉద్యోగులకు వర్క్ ఇచ్చి దానికి డెడ్ లైన్ కూడా ఇచ్చామని అయినా వారు వర్క్ కంప్లీట్ చేయలేదని అందుకే ఇటువంటి పనిష్మెంట్ ఇచ్చామని తెలిపింది.
Cocaine In US White House : వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం .. అమెరికా అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చింది..?!