Railway : ఒక్క ఎలుకను పట్టడానికి రూ.41,000 ఖర్చు చేసిన రైల్వే శాఖ .. ఎన్ని ఎలుకలు పట్టిందో తెలుసా..?

ఒక్క ఎలుకను పట్టుకోవటానికి రైల్వే అధికారలు ఏకంగా రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. రైల్వే అధికారులు చేసిన ఈ ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Railway Rats catch costs

Railway Rats catch costs : కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది అనేది ఓ సామెత. కానీ నిజంగా రైల్వే శాఖ అధికారులు ఎలుకల్ని పట్టుకోవటానికి దాదాపు అటువంటి పనే చేశారు. ఒక్క ఎలుకను పట్టుకోవటానికి రైల్వే అధికారలు ఏకంగా రూ.41వేలు పైనే ఖర్చు చేశారు. ఉత్తర రైల్వే అధికారులు చేసిన ఈ ఘనకార్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నీముచ్ కు చెందిన ఆర్టీఏ (Right to Information )కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ (Chandrashekhar Gaur)సమాచార హక్కు చట్టం కింద కోరినప్పుడు రైల్వే శాఖ స్వయంగా ఈ వివరాలు తెలియజేసింది. నార్త్ రైల్వే (Northern Railways)లక్నో డివిజన్ 2020 నుంచి 2022 వరకు ఎలుకలను పట్టడం కోసం రూ.69.5 లక్షలు ఖర్చు పెట్టిందని తెలియజేసింది. ఇంతకీ రైల్వే శాఖ పట్టిన ఎలుకలు ఎన్నో తెలుసా..?168 ఎలుకలు. మొత్తం 168 ఎలుకలు పట్టించారు. దీనికి అధికారులు పెట్టిన ఖర్చు రూ.69.5లక్షలు. 2020-2022 మధ్య ఎలుకలు పట్టుకోవటానికి ఈ ఖర్చు పెట్టారు.

YashoBhoomi In Delhi : ఢిల్లీలో మరో అద్భుతం ‘యశోభూమి’.. రేపే ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభం.. ప్రత్యేకతలేంటో తెలుసా..?

ఎలుకలు ,చెదల నివారణ ఇవన్నీ ప్రాథమిక మెయింటెనెన్స్ కింద రైల్వే పరిగణిస్తుంటుంది. నార్నర్ రైల్వే పరిధిలో ఢిల్లీ, అంబాలా, లక్నో, ఫిరోజ్ పూర్, మొరాదాబాద్ డివిజన్లు ఉన్నాయి. చంద్రశేఖర్ గౌర్ నార్నర్ రైల్వే వ్యాప్తంగా సమాచారం కోరారు. ఒక్క లక్నో డివిజన్ మాత్రమే స్పష్టమైన సమాచారం ఇచ్చింది. ఎలుకల కారణంగా జరిగిన నష్టం ఎంత? అన్న గౌర్ ప్రశ్నకు లక్నో డివిజన్ కూడా సమాచారం ఇవ్వలేదు. నష్టపోయిన గూడ్స్, వస్తువులకు సంబంధించిన సమాచారం లేదని..నష్టాన్ని తాము అంచనా వేయలేదని తెలిపింది.