West bengal Panchayat poll
West bengal Panchayat poll : ఎన్నికలు వచ్చాయంటే ప్రభుత్వ సర్వీసులో ఉండే ఉద్యోగులు ఎలక్షన్ డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఎన్నికల డ్యూటీ పడుతుంది. కానీ కొంతమందికి వెళ్లటానికి ఇష్టం లేకపోయినా డ్యూటీ వేస్తే వెళ్లాల్సిందే. డ్యూటీ వేశాక వెళ్లనని చెప్పటం కుదరదు. ఎలక్షన్ డ్యూటీ ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించిన కొంతమంది ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ డ్యూటీ తప్పించుకోవటానికి ఏకంగా ఎన్నికల్లో పోటీని నిలబడ్డారు. పశ్చిమ బెంగాల్లో జరుగనున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా అలీపుర్ దూర్ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది.
SBI : ఏటీఎం కార్డు లేకుండా అన్ని ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవచ్చు .. ఎలాగంటే..
అలీపుర్ దూర్ జిల్లాలోని జటేశ్వర్ గ్రామంలో పాల్ అనే వ్యక్తి కుటుంబంలో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఎలక్షన్ డ్యూటీకి వెళ్లటం ఇష్టంలేదు. ఎందుకంటే వారంతా ఓ వివాహానికి తప్పనిసరిగా హాజరుకావాల్సిఉంది. దీంతో ఎన్నికల్లో ఎలక్షన్ డ్యూటీ తప్పించుకోటానికి పంచాయతీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీలో నిలబడ్డారు. జులై 8న జరగనున్నాయి. జులై 5న వారి కుటుంబంలో వివాహం జరగాల్సి ఉంది. జులై 7న రిసెప్షన్ ఉంది. తమ కుటుంబంలో జరిగే వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఎన్నికల విధులు అడ్డుగా ఉన్నాయనే కారణంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు విద్యా వాలంటీర్లు..జులై 8న గ్రామంలో జరగబోయే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ డ్యూటీని తప్పించుకునేందుకు వీరంతా ఏకంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
LPG Gas Cylinder : మళ్లీ పెరిగిన గ్యాస్ ధర .. ఎంతంటే..?
జటేశ్వర్ గ్రామంలో రిటైర్డ్ ప్రధానోపాధ్యుడు జిబాన్ కృష్ణ పాల్ కుమారుడి వివాహం జులై 5 నుంచి జులై 7 వరకు వివాహ వేడుకలు జరగనున్నాయి. వీరి కుటుంబంలో ఏడుగురు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నారు.పంచాయతీ ఎన్నికల వీరికి జులై 8న ఎలక్షన్ డ్యూటీ వేస్తారని దాన్నుంచి తప్పించుకోవటానికి ఏకంగా ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. వీరు ఒక్కొక్కరు రూ.500 చొప్పున నామినేషన్ ఫీజు ఎన్నికల అధికారులకు చెల్లించి పంచాయతీ బరిలో నిలబడ్డారు. దీంతో వీరిని ఎన్నికల డ్యూటీ వెయ్యటం వీల్లేకపోయింది.