Bihar : రూ.2లంచం తీసుకున్న ఐదుగురు పోలీసులు,37 ఏళ్లు విచారణ, కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే..?

ఐదుగురు పోలీసులు రెండు రూపాయలు లంచం తీసుకున్న కేసును కోర్టు 37ఏళ్ల విచారించింది. తాజాగా తీర్పును ప్రకటించింది. మరి ఆ పోలీసులు దోషులా..? నిర్ధోషులా..కోర్టు ఇచ్చిన తీర్పులో ఏముంది..?

Two rupees bribe case..Court 37 years hearing

Two rupees bribe case..Court 37 years hearing : పోలీసులు లంచాలు తీసుకున్నారు అనే వార్త పెద్ద విశేషం. సర్వసాధారణమే అనేలా ఉంటుంది. అలాగే కోర్టులో తీర్పులు సంవత్సరాలే కాదు దశాబ్దాలే పడుతుందనే విషయం కూడా అంతే సాధారణమైన విషయం. కానీ బీమార్ పోలీసులు లంచం తీసుకున్న కేసే ఓ విచిత్రం అనుకుంటే ఆ కేసును కోర్టు 37ఏళ్ల పాటు విచారించటం దానిపై ఇచ్చిన తీర్పు కూడా వైరల్ గా మారింది. ఆకేసు ఏమిటంటే..బీహార్ ని బెగుసరాయ్ జిల్లాలో ఐదుగురు పోలీసులు కలిసి వాహనదారుల నుంచి రూ.2లు లంచం తీసుకున్నారు. అదీ 1986లో. అది కేసు అయ్యింది. కోర్టుకెళ్లింది. అప్పటినుంచి ఆ కేసు విచారణ సాగుతునే ఉంది. తాజాగా కోర్టు తీర్పునిచ్చింది. రెండు రూపాయల లంచం కేసు..ఐదుగురు పోలీసులపై కేసు నమోదు..కోర్టులో 37ఏళ్లపాటు విచారణ తరువాత ఇచ్చిన తాజా తీర్పు ఇదంతా వింటే కేవలం రెండు రూపాయల లంచం కేసు ఇన్నాళ్లు విచారణా…? అదో కేసా అనిపిస్తుంది..కానీ లంచం అంటే నేరమే కదా..నేరమంటే విచారణ జరపాల్సిందే కదా..

మరి ఈవిచిత్రమైన కేసు వివరాల్లోకి వెళితే..1986 జూన్‌ 10న రాత్రి సమయంలో భాగల్‌పుర్‌ పరిధిలోని ఓ చెక్‌పోస్ట్‌ వద్ద ఐదుగురు పోలీసులు డ్యూటీ చేస్తున్నారు. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలను చెక్కింగ్ చేసే డ్యూటీ. ఈక్రమంలో వెళ్లే వాహనదారుల నుంచి వారు రూ.2 వసూలు చేశారు అని బెగుసరాయ్‌ ఎస్పీ అరవింద్‌ వర్మకు ఫిర్యాదు అందింది. వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవటానికి ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగారు. దానికి ఓ ప్లాన్ కూడా వేశారు.

Onions Smelly In Flight : ఎయిరిండియా విమానంలో ఉల్లిపాయల వాసన, హడలిపోయిన ప్రయాణీకులు.. ఎమర్జన్సీ ల్యాండ్ చేసిన పైలట్

దీంట్లో భాగంగా చెక్‌పోస్ట్‌ వైపుగా వెళుతున్న ఓ వాహనాన్ని ఆపారు ఎస్పీ. ఆ వాహనం డ్రైవర్ కు రెండు రూపాయల నోటు ఇచ్చారు. ఇచ్చేముందు ఆనోటుపై ఎస్పీ సంతకం చేసి మరీ ఇచ్చారు. మీరు ఈ దారి వెంట వెళ్లే సమయంలో పోలీసులు మిమ్మల్ని ఆపి లంచం అడిగితే ఈ నోటు ఇవ్వండి అని చెప్పారు. దానికి ఆ డ్రైవర్ సరేనని ముందుకెళ్లాడు. ఎస్పీ ప్లాన్ ఫలించింది. ఆ వాహనం చెక్‌పోస్ట్‌ వద్దకు వెళ్లగానే అక్కడున్న పోలీసులు వాహనాన్ని ఆపారు. డ్రైవర్‌ నుంచి రూ.2 డిమాండ్‌ చేశారు. దీంతో ఎస్పీ సంతకం చేసిచ్చిన ఆ రెండు రూపాయల నోటును ఓ కానిస్టేబుల్‌కు ఇచ్చాడు డ్రైవర్‌. తిరిగి వచ్చి మీరు చెప్పినట్లే చేశాను అంటూ జరిగిందంతా ఎస్పీకి చెప్పాడు. అంతే ప్లాన్ సక్సెస్ అవ్వటంతో ఎస్పీ వెంటనే చెక్‌పోస్ట్‌ వద్ద వద్దకు వెళ్లి కానిస్టేబుల్‌ జేబులో నుంచి తాను సంతకం చేసిచ్చిన నోటును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఐదుగురు పోలీసులపై కేసు నమోదు చేశారు.

Sunflower : సూర్యుడు ఎటు తిరిగితే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వు వెనుక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ..!

అలా ఎస్పీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు ఐదుగురు పోలీసులు. రామ్ రతన్ శర్మి,కైలాష్ శర్మ,జ్ఞాని శంకర్, యుగేశ్వర్ మహ్తో, రామ్ బాలక్ రాయ్ అనే పోలీసులపై ముఫాసిల్ పోలీసు స్టేషన్ లోని వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు సబ్మిట్ చేయటం జరిగింది. ఈ కేసు అనేకసార్లు విచారణ జరిగి చివరకు భాగల్పుర్ లోని విజిలెన్స్ కోర్టుకు చేరగా తాజాగా వారంతా నిర్ధోషులు అని తీర్పునిచ్చింది.అలా 37ఏళ్లపాటు సాగిన ఈ కేసు విచారణ ఎట్టకేలకు ముగింపు పలికింది.