Rahul Gandhi : గోవాకు ఒంటరిగా వెళ్లి జంటగా తిరిగొచ్చిన రాహుల్ గాంధీ.. తల్లికి గిఫ్టుగా ఏం తెచ్చారో తెలుసా..?

గోవా పర్యటనకు ఒంటరిగా వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జంటగా తిరిగొచ్చారు. వస్తు వస్తు ఓ కొత్త కుటుంబ సభ్యుడ్ని తీసుకొచ్చి తల్లి సోనియా గాంధీకి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ కొత్త బహుమతిని చూసిన సోనియా గాంధీ ఎంతో సంతోషించారు. కుమారుడు రాహుల్ గాంధీ ఇచ్చిన ఆ కొత్త బహుమతిని అందుకున్న సోనియా గాంధీ పరవశించిపోయారు.

sonia gandhi rahul gandhi

Sonia Gandhi. surprise Gift from son Rahul : గోవా పర్యటనకు ఒంటరిగా వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ జంటగా తిరిగొచ్చారు. వస్తు వస్తు ఓ కొత్త కుటుంబ సభ్యుడ్ని తీసుకొచ్చి తల్లి సోనియా గాంధీకి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఆ కొత్త బహుమతిని చూసిన సోనియా గాంధీ ఎంతో సంతోషించారు. కుమారుడు రాహుల్ గాంధీ ఇచ్చిన ఆ కొత్త బహుమతిని అందుకున్న సోనియా గాంధీ పరవశించిపోయారు. తల్లీ కొడుకులు ఆ కొత్త కుటుంబ సభ్యుడితో ఉన్న ఫోటోను చూస్తే కాంగ్రెస్ అగ్రనేతలిద్దరు ఎప్పుడూ కనిపించినంత సరికొత్తగా కనిపించారు.

ఇంతకీ రాహుల్ గాంధీ తల్లికి ఏం బహుమతి ఇచ్చారంటే ఓ క్యూట్ కుక్కపిల్లను తీసుకొచ్చి ఇచ్చారు. నూరీ అనే జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి కుక్కపిల్లని తీసుకొచ్చి తల్లికి ఇచ్చారు. రాహుల్ గాంధీ బుధవారం తన కొత్త కుటుంబ సభ్యుడిని సోషల్ మీడియాకు పరిచయం చేశారు. గోవా నుంచి తెచ్చుకున్న పెంపుడు కుక్క పిల్ల నూరీ ఫొటోను షేర్ చేశారు. తన తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చానని తెలిపారు.

ఆగస్టులో గోవా పర్యటనకు వెళ్లిన రాహుల్.. ఉత్తర గోవాలోని మపుసా ప్రాంతంలో కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లారు. దాన్ని శివానీ పిత్రే, ఆమె భర్త నిర్వహిస్తున్నారు. జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన రెండు కుక్క పిల్లలు నచ్చడంతో విమానంలో ఒకదాన్ని తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆ తర్వాత మరో కుక్కను కూడా తెప్పించుకున్నారు. తన వెంట తీసుకెళ్లిన ఆడ కుక్క పిల్లకు నూరీ అని పెట్టారు. దాన్ని నేరుగా తన ఇంటికి వెళ్లి తల్లి సోనియా గాంధీకి బహుమతిగా ఇచ్చారు. కుక్కపిల్ల బాగుందన్న సోనియా దానితో ఆడుకున్నారు.

అప్పటికే ఇంట్లో ఉన్న మరో కుక్కపిల్లతో నూరీ కలిసిపోయి ఆడుకుంటోంది. గోవాలో కుక్కల పెంపక కేంద్రానికి వెళ్లిన దగ్గరి నుంచి నూరీని తనతో పాటు తీసుకెళ్లి సోనియా గాంధీకి ఇవ్వడం వరకూ రూపొందించిన వీడియోను రాహుల్ ఈ రోజు ప్రపంచ జంతు దినోత్సవం సందర్భంగా తన యూట్యూబ్‌ చానెల్‌లో అప్‌లోడ్‌ చేశారు. జంతువుల పట్ల తన ప్రశంసలను వ్యక్తం చేస్తూ.. “జంతువులు మనకు షరతులు లేని ప్రేమకు అర్థాన్ని నేర్పుతాయి! కొన్ని నెలలుగా ఆమె మనతో కలిసి ఉంది, చిన్న నూరీ మన జీవితాల్లో వెలుగులు నింపింది. #ప్రపంచ జంతు దినోత్సవం”అంటూ పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు