Sweaters for God idols : వణికిస్తున్న చలిపులి.. దేవుళ్లకు స్వెట్టర్లు, శాలువాలు కప్పిన పూజారులు

శీతాకాలం చలిపులి చంపేస్తోంది. మనుషులకే దేవుళ్లకు కూడా చలిపెడుతోందట..అందుకు దేవుళ్లకు స్వెట్టర్లు, శాలువాలు కప్పారు.

Sweaters for God idols

gods idols were warm clothes protect cold : శీతాకాలం.. చలిపులి చంపేస్తోంది. ప్రజలు చలి మంటలు వేసుకుని .. స్వెట్టర్లు కప్పుకుని చలినుంచి ఉపశమనం పొందుతున్నారు. చలి అనేది మనుషులకే ఉంటుందా..దేవుళ్లకు కూడా ఉంటుందా..? అదేంటీ దేవుళ్లకు చలి ఏంటీ..? అని ఆశ్చర్యపోవచ్చు.కానీ దేవుళ్లకు కూడా చలివేస్తోదట..అందుకే దేవుళ్లకు..దేవతలకు స్వెట్టర్లు కప్పారు. వినటానికి ఇదేదో వింతగా..విచిత్రంగా అనిపించొచ్చు. కానీ నిజమే. దేవుళ్లకు కూడా చలి వేస్తోందట..అందుకే స్వెట్టర్లు కప్పారు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోని సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో దేవుళ్లకు స్వెట్టర్లు, శాలువాలు కప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ దేవాలయంలో హనుమంతుడు, వినాయకుడు, శివుడు, రాముడు, సీతమ్మవారు ఇలా అన్ని విగ్రహాలకు స్వెట్టర్లు, శాలువాలు కప్పారు. చలినుంచి ఉపశమనం కోసం ఇలా ఏర్పాటు చేశారట..

శీతాకాలంలో చలి వేస్తోందని స్వెట్లర్లు కప్పారు..మరి వేసవికాలంలో ఉక్కపోస్తోందని ఏసీలు, ఫ్యాన్లు పెడతారా.. ఏంటీ..? అని అనుకోవచ్చు.నిజమే ఇటువంటివి కూడా భారతదేశంలోని పలు దేవాలయాల్లో జరిగాయి. వేసవి వేడినుంచి ఉపశమనం కోసం కొన్ని దేవాలయాల్లో దేవుళ్లకు ఏసీలు, ఫ్యాన్లు పెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. బీహార్‌లోని గయాలో దేవుళ్లకు ఏసీలు పెట్టారు. అలాగే కోవిడ్ సమయంలో దేశంలోని పలు దేవాలయాల్లో దేవుళ్లకు మాస్కులు పెట్టిన ఘటనలు ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు