Most Expensive Bull : వరదల్లో చిక్కుకున్నఅత్యంత ఖరీదైన ఎద్దును కాపాడిన NDRF బృందం..దాని విలువ ఎంతో తెలుసా..?

వరదల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు..జంతువుల్ని కూడా NDRF బృందాలు కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఎన్నో జంతువులను కాపాడుతున్న క్రమంలో అత్యంత ఖరీదైన ఎద్దును కూడా కాపాడారు NDRF సిబ్బంది.

Most Expensive Bull Rescued In Yamuna Floods

Yamuna River Floods In Delhi : భారీగా కురుస్తున్న వర్షాలకు యమునా నది (Yamuna Floods)ఉప్పొంగుతోంది. కానీ కాస్త ఉదృతి తగ్గటంతో ఢిల్లీ (Delhi) కాస్త ఊపిరి పీల్చుకుంది. వరదల్లో చిక్కుకున్న ప్రజలతో పాటు..జంతువులను కూడా NDRF బృందాలు కాపాడుతున్నారు. వరదల్లో చిక్కుకున్న ఎన్నో జంతువులను కాపాడుతున్న క్రమంలో ప్రీతమ్‌ జాతి(‘Pritam’ bloodline)కి చెందిన ఎద్దు కూడా ఉంది. ఈ బసవన్న ధర కూడా భారీగా ఉంది.దీని ధర సుమారు రూ.1 కోటి. ఈ కోటి రూపాయల విలువైన ఎద్దును కాపాడిన ఫోటోలు, వీడియోలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం (NDRF) సోషల్‌ మీడియాలో ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఘజియాబాద్‌లోని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) యొక్క 8వ బెటాలియన్ పశువులను కాపాడిన ఫోటోలను పోస్ట్ చేస్తు ఈ కోటి రూపాయల విలువైన ఎద్దును రక్షించిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది(Team @8NdrfGhaziabad ). ఈ ఎద్దు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఎద్దు.

నోయిడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను కాపాడేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎక్కవ వరదలు విపత్తులు వచ్చినా అక్కడ ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందించే సేవలు మాటల్లో వర్ణించలేనివి. వరదలైనా భూకంపాలైనా ఎటువంటి విపత్తులు అయినా వీరి సేవలు అందిస్తారు. ఎన్నో ప్రాణాలను కాపాడుతారు. తమ ప్రాణాలకు తెగించి సాటి మనుషుల ప్రాణాలనే కాదు మూగ జీవాలను కూడా కాపాడుతుంటారు. అటువంటి వారి సేవలు ఇటీవల ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో ఎంతో శ్రమించి ప్రాణాలను కాపాడుతున్నారు.

కాగా ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఢిల్లీ వణికిపోయింది. 45 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టేలా వర్షాలు అతలాకుతలం చేశాయి. ప్రస్తుతం యమునా నదిలో నీటి మట్టం తగ్గుతుండటంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంటోంది. ఉత్తరప్రదేశ్ లో సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతంగా మారాయి.