Indore food hub poha, jalebi for voters
Madhya Pradesh Assembly Elections 2023 : ఎన్నికలు వచ్చేయంటే రాజకీయ నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు బహుమతులు ఇస్తుంటాయి. ఓటర్లకు రకరకాల వస్తువులు బహుమానాలుగా ఇవ్వటం సర్వసాధారణంగా మారిపోయింది. మిక్సీలు, గ్రైండర్లు, చీరలు, డబ్బు వంటివి ఓటర్లకు బహుమానాలుగా ఇస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మాత్రం ఓ వెరైటీ ఆఫర్ ఇచ్చారు. ఈ వినూత్న ఆఫర్ ఇచ్చింది రాజకీయ నేతులు కాదు.
ఇండోర్ లో ఓటర్లకు ఓ ప్రముఖ ఫుడ్ హబ్ సంఘం స్వీట్ ఆఫర్ ఇచ్చింది. సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. కానీ ఓటర్లు మాత్రం తీరిగ్గా 10.00లు దాటాక పోలింగ్ బూత్ లకు క్యూ కడుతుంటారు. అలా కాకుండా ఉదయం తొమ్మిది గంటల లోపు ఓటు వేయటానికి వచ్చినవారికి పోహా, జిలేబీ ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది ఇండోర్‌లోని ‘56 దుకాణ్’ యజమానుల సంఘం.
Assembly Elections 2023: ఎన్నికల వేళ అప్రమత్తమైన పోలీసులు.. 24 గంటల్లో 700 మంది నేరగాళ్లు అరెస్ట్
ఐదు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్ 17న మధ్యప్రదేశ్ లో ఎన్నికలు జరుగనున్నారు. దీంట్లో భాగంగా ఇండోర్‌లోని ప్రముఖ ఫుడ్ హబ్ ‘56 దుకాణ్’ తొమ్మిది గంటల లోపు ఓటు వేసి వచ్చిన వారికి ఫ్రీగా పోహా, జిలేబీలను ఇస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు గుంజన్ శర్మ తెలిపారు. తొమ్మిది గంటల తర్వాత ఓటేసి వచ్చిన వారికి పోహా, జిలేబీలను ఇస్తామని తెలిపారు. ఈ ఆఫర్ నవంబర్ 17 ఉదయం 9గంటల వరకు మాత్రమే ఉంటుందని ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని సూచించారు. ఈ స్నాక్స్ లబ్ది పొందాలనుకునేవారు ఓటు వేసినట్లుగా ‘వేలిపై ఇంక్ మార్క్ ’చూపించాలని తెలిపారు.