International Left handers Day 2023 : వాచీని ఎక్కువమంది ఎడమ చేతికే ఎందుకు పెట్టుకుంటారు..?

చిన్న చిన్న విషయాలు పెద్దగా పట్టించుకోం. మనం రోజు ధరించేవి..చేసే పనులు, మాట్లాడుకునే ఊత పదాలు..మన వాడుక భాషలో దొర్లే పదాలు ఇలా చిన్న చిన్న వాటి వెనుక ఆసక్తికర కారణాలుంటాయి. ఎప్పటి నుంచో వచ్చే అలవాట్లు ఉంటాయి.అవి మన రోజువారీ జీవనశైలిలో భాగంగా మారిపోతాయి. అటువంటి చిన్న చిన్న విషయాలని పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు తెలుసుకోగలుగుతాం. సో పరిశీలన అనేది ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తుంది.

watches are worn on the left hand

International Left handers Day 2023 : చేతికి వాచీ పెట్టుకుంటే ఆ అందమే వేరబ్బా..కానీ స్మార్ట్ ఫోన్లు వచ్చాక వాచీలు పెట్టుకోవటం చాలామంది మానేశారు. కానీ ఇటీవల ఎన్నో ఫీచర్స్ తో వచ్చిన స్మార్ట్ వాచీలను పెట్టుకుంటున్నారు. సాధారణ వాచీలు అంటే కేవలం టైమ్ చూపించే వాచీలను పెట్టుకోవటం చాలామంది మానేశారు. ఒకవేళ పెట్టుకున్నవారు మాత్రం వాచీని ఎడమ చేతికే పెట్టుకుంటారు. చాలా తక్కుమంది మాత్రమే కుడిచేతికి పెట్టుకుంటారు. మరి వాచీని ఎక్కువమంది ఎడమచేతికే ఎందుకు పెట్టుకుంటారు? అని ఎప్పుడన్నా ఆలోచించారా..?

ఏ రకం వాచీ పెట్టుకున్నా 90శాతం (పెట్టుకునేవారిలో) మంది ఎడమచేతికే పెట్టుకుంటుంటారు.కుడి చేతికి వాచీని ఎందుకు పెట్టుకోకూడదు..? పెట్టుకుంటే ఏమన్నా ఇబ్బందులుంటాయా? అనే విషయం తెలుసుకుందాం..ఎడమచేతి వాటం అలవాటున్నవారికంటే కుడి చేతివాటం అలవాటు ఉన్నవారే ఎక్కుమంది ఉంటారు. వారు పనులు (ఎక్కువ మంది) కుడి చేతులతోనే చేసుకుంటారు. కుడి చేత్తో రాయడం, టైపింగ్ చేయడం, ఇంటిపనులు చేసుకోవటం, ఏవన్నా బరువులు మోయటం వంటివి. ఏపని చేసినా కూడా ఎడమ చేతికి వాచి ఉండడంతో ఈజీగా మనం ఎంత పనిలో ఉన్నా కూడా టైం ఎంత అయ్యింది అనేది చూసుకోవచ్చు. అలా ఎడమచేతికి వాచీ ఉంటే టైం చూడడానికి ఇబ్బంది రాదు. అందుకే ఎడమ చేతికి వాచీని పెట్టుకుంటారు. అలాగే టైమ్ అనగానే మన కనుదృష్టి కూడా ఎడమచేతివైపే వెళుతుంది. అంటే టైమ్ తెలుసుకోవాలంటే మన మెదడు ఎడమవైపుకే మొగ్గుచూపుతుంది.

International Lefthanders Day 2023 : ఎడమ చేతివాటానికి కారణమేంటో తెలుసా..? పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

ఒకవేళ కుడి చేతికి పెట్టుకుంటే పనిలో ఉన్నప్పుడు టైం చూసుకోవడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. పనిగట్టుకుని చేతిలో పని ఒదిలేసి చూడాల్సి ఉంటుంది. ఎడమ చేతికి పెట్టుకోవడం వలన ఈజీగా మనం కొన్ని సెకండ్లలోనే టైం ని చూసుకొని తెలుసుకోవచ్చు. చూడడానికి సౌకర్యంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది కూడా రాదు ఇదే సౌకర్యంతంగా అనిపించి అప్పటి వాళ్ళు ఎడమ చేతికి వాచీ పెట్టుకోవడం మొదలుపెట్టారు.

దానినే ఎక్కువమంది ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. అది స్మార్ట్ వాచీ అయినా..మరే దైనా. వాచి మోడల్స్ మారినా స్మార్ట్ వాచ్ లో మార్కెట్ లోకి ఎన్ని వచ్చినా..వాటి బ్రాండ్స్ ఏవైనా గానీ వాచీ అంటే ఎడమచేయి గుర్తుకొస్తుంది. టైమ్ చూడాలంటే ఎడమచేయివైపే మన కనుదృష్టి వెళుతుంది. అదన్నమాట ఎడమచేతికి వాచీ పెట్టుకునే వెనుక కారణం..

అనాదికాలం నుంచి ఏ అలవాటు వచ్చినా.. మన అలవాట్లను బట్టి మన బాడీ లాంగ్వేజ్ ను బట్టి వస్తాయి. అలాగే ఏనానుడి వచ్చినా..అది మన జీవితాల్లోంచి పుట్టుకొచ్చినవే. మనం ప్రతీ రోజు చేసే పనులే అయినా వాటిని మనం పెద్దగా గుర్తించం..పెద్దగా పట్టించుకోం. కానీ పరిశీలించి చూస్తే అన్నింటి వెనుక ఓ కారణం ఓ శాస్త్రీయత ఉంటుంది.