International Lefthanders Day 2023 : ఎడమ చేతివాటానికి కారణమేంటో తెలుసా..? పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు

కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్. నిజమే కుడి ఎడమైతే తప్పులేదు..ఎడమ చేతి వాటం తప్పు కాదు. కానీ ఎడమచేతి వాటం ఉన్నవారి కాస్త ప్రత్యేకంగా చూస్తాం. కొంతమంది అయితే కాస్త వివక్షగా చూస్తారు. అదేంటీ ఎడమచేత్తో అంటూ ఏదో వింతగా చూస్తారు. ఎడమను తక్కువ చేసి చూస్తారు. కానీ కుడి కంటే ఎడమే బెస్ట్ అంటున్నారు పరిశోధకులు.

International Lefthanders Day 2023

International Lefthanders Day 2023 : ఆగస్టు 13, ఈరోజు International Left handers Day. అంటే ఎడమచేతి వాటం గలవారి కోసం ఓ రోజు అన్నమాట. కుడి చేతి వాటం అలవాటు ఉన్నవారి కంటే ఎడమచేతి వాటం ఉన్నవారు ప్రత్యేకంగా ఉంటారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అని ఓ కవి కూడా పాట రూపంలో చెప్పిన విషయం తెలిసిందే.  నిజమే కుడి ఎడమైతే తప్పులేదు..ఎడమ చేతి వాటం తప్పు కాదు. కానీ ఎడమచేతి వాటం ఉన్నవారి కాస్త ప్రత్యేకంగా చూస్తాం. కొంతమంది అయితే కాస్త వివక్షగా చూస్తారు. అదేంటీ ఎడమచేత్తో అంటూ ఏదో వింతగా చూస్తారు. ఎడమను తక్కువ చేసి చూస్తారు. కానీ కుడి కంటే ఎడమే బెస్ట్ అంటున్నారు పరిశోధకులు. అసలీ కుడి ఎడమల తికమక ఏంటీ ఎడమ బెస్ట్ ఎలా..? అనే విషయం తెలుసుకుందాం..

నిజానికి ఎడమచేతి వాటం అలవాటుకు ఓ కారణం ఉందంటున్నారు పరిశోధకులు. ఈ ప్రపంచంలో ప్రతీ 10మందిలో ఒకరికిది ఎడమచేతి వాటంగలవారే ఉన్నారు.. కవల పిల్లలపై జరిగిన పరిశోధనలు ఎడమచేతి అలవాటుకు జీన్స్ తో సంబంధం ఉందని వెల్లడించాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో మాత్రం ఎడమచేతి వాటానికి కారణం జీన్స్ అని వెల్లడించారు. మెడదు పనిచేయడంలో జీన్స్ ప్రభావం ఉందని తేల్చారు.

International Lefthanders Day: ఎడమ చేతివాటం వారు ఎక్కువగా ఉన్న దేశం ఏది? చైనాలో మరీ ఇంత తక్కువగా ఎందుకున్నారో తెలుసా?

యూకేలోని బయోబ్యాంక్ లో మొత్తం నాలుగు లక్షల మందికి చెందిన జీన్స్ సమాచారంలో 38,000మంది ఎడమచేతి వాటం ఉన్నవారే కావటం విశేషం. అయితే కుడిచేతి అలవాటు ఉన్నవాళ్లకు, ఎడమచేతివాటం ఉన్నవాళ్లకు మధ్య తేడాలను తెలుసుకునేందుకు వారి మెదడు నిర్మాణంలో పరిశోధన చేస్తే ఏదో తేడా కనిపించింది పరిశోధకులకు. ఆ తేడాకు కరాణం కనిపెట్టాలని పరిశోధనను ముందుకు తీసుకెళ్లగా ‘కుడి,ఎడమ’చేతి వాటం అలవాట్లను డిసైడ్ చేసేది మెదడులో ఉండే సైటో స్కెలిటన్ అనే పదార్ధమని గుర్తించారు. అయితే ఈ సైటో స్కెలిటన్ లోనే ఎడమచేతి అలవాటును డిసైడ్ చేసే జీన్స్ ఉన్నట్లుగా గుర్తించారు.

కుడిచేతి అలవాటు ఉన్నవాళ్లతో పోలీస్తే ఎడమచేతి వాటం అలవాటున్నవారి మెదడులో కుడి, ఎడమ భాగాలు ఒకదానితో మరొకటి బాగా కలిసిపోయి ఉందని గుర్తించారు. అలాగే ఎడమచేతి అలవాటు ఉన్నవారి మెదడులో లాంగ్వేజ్ స్కిల్స్ కు సంబంధించిన ప్లేస్ లు స్పష్టంగా కనిపించాయట. అందుకే ఎడమచేతి వాటం ఉన్నవారు కుడిచేతి వాటం అలవాటు ఉన్నవారికంటే బాగా మాట్లాడతారని వారు మాట్లాడే తీరులో స్పష్టత ఉంటుందని తేలిందట.

అంతేకాదు ఈ కుడి ఎడమల విషయం మరో కీలక విషయం ఏమిటంటే..కుడి చేతి అలవాటు ఉన్నవారకంటే ఎడమచేతి అలవాటు ఉన్నవారికి స్కిజోప్రీనియా అంటే వ్యాధి ప్రమాదం తక్కువగా ఉంటుందట. వారికి పక్షవాతం (పెరాలిసిస్) వచ్చే అవకాశం లేదని తేలింది.

International Lefthanders Day: ఎడమ చేతితో ప్రపంచం అబ్బురపడే విజయాలు సాధించింది వీరే..

కాకపోతే ఈ జీన్స్ విషయంలో కుడి ఎడమ చేతి అలవాట్లతో సంబందం ఉన్న జీన్స్ గురించి తెలుసుకున్నది ఒకే ఒక్క శాతం. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందంటున్నారు.ప్రపంచ వ్యాప్తంగా మరింత మందిపై పరిశోధనలు చేస్తే మరింత సమాచారం ఉంటుందని భావిస్తున్నారు.

లెఫ్ట్ హ్యాండర్స్ బెనిఫిట్స్..
ఎడమచేతి వాటం ఉన్నవారు చూడటానికి స్మార్ట్ గా ఉండటమే కాదు తెలివితేటల్లో కూడా బెస్ట్ గా ఉంటారు.
ఎడమచేతి వాటం ఉన్నవారు ఏ విషయాన్నైనా (కుడిచేతి అలవాటు ఉన్నవారికంటే) త్వరగా అర్థం చేసుకుంటారు.
అలాగే వ్యాధులు వచ్చిన సమయంలో కుడిచేతి అలవాటువారి కంటే ఎడమచేతి అలవాటున్నవారు త్వరగా కోలుకుంటారట.
ఆటల విషయంలో కూడా ఎడమచేతి వాటం ఉన్నవారు రాణిస్తారు. అలాగే వారికి మెమరీ కూడా చాలా బాగా ఉంటుంది. అంతేకాదు సంపాదనలో కూడా కుడిచేతివాటం వారి కంటే ఎడమచేతివాటం అలవాటున్నవారు బెస్ట్ గా ఉంటారట.
ఇలా ఎడమచేతి వాటం అలవాటున్నవారు దిబెస్ట్ గా ఉంటారు. కాబట్టి ఎడమచేతి వాటంవారిని తక్కువ చేసి చూడద్దంటున్నారు నిపుణులు.