మీ ఇంట్లోనూ ఇలాంటి స్పూన్ వాడుతున్నారా?

Household Spoon: ఎవరి ఇంట్లోనైనా ఇటువంటి చెంచా ఉందా అని అడిగాడు. దీంతో అతడి పోస్ట్..

Common Indian Household Spoon

భారతీయులు వాడే వంట పాత్రలతో వారి సంస్కృతి, సంప్రదాయాలు ముడిపడి ఉంటాయి. పాత కాలంలో ఇళ్లలో వాడిన ఎన్నో రకాల పాత్రలు ఇప్పటికే కనుమరుగైపోయాయి. అంటే.. మరచెంబు వంటివి ఇప్పుడు అంతగా వాడుకలో లేవు. కానీ, ఓ రకమైన చెంచాను మాత్రం చాలా మంది వాడుతున్నారు.

తాజాగా ఓ ఎక్స్ యూజర్ తన ఇంట్లోని స్టీల్ స్పూన్‌ ఫొటోను పోస్ట్ చేశాడు. ఎవరి ఇంట్లోనైనా ఇటువంటి చెంచా ఉందా అని అడిగాడు. దీంతో అతడి పోస్ట్ కి భారీగా స్పందనలు వస్తున్నాయి. ఇటువంటి స్పూనే తమ ఇంట్లోనూ ఉందని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.

కొందరు అందుకు సంబంధించిన ఫొటోలు కూడా పెడుతున్నారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇటువంటి స్పూన్ ఉండడం సాధారణమేనని కొందరు కామెంట్లు చేశారు. చాలా మంది ఇటువంటి స్పూన్ నే ఇంకా ఎందుకు వాడుతున్నారని అడుగుతూ కొందరు కామెంట్లు చేశారు. ఇది మన జాతీయ స్పూన్ అని కొందరు అంటున్నారు.

 Also Read: ఢిల్లీ మెట్రో రైలులో మరో చిత్రవిచిత్ర ఘటన.. ఇద్దరమ్మాయిలు హోలీ రంగులు పూసుకోవడమే కాకుండా..