World Most Expensive Mineral : వజ్రం కంటే ఖరీదైనది, ఒక్కటి దక్కాలన్నా రూ. కోట్లు ఖర్చు పెట్టాల్సిందే..

బంగారం, వజ్రం కంటే ఖరీదైనది. ఆభరణాల్లో అమరిస్తే పచ్చని ప్రకృతి అంత అందంగా నిగారింపుగా కనిపిస్తుంది. కంటికి కనువిందు చేసే అరుదైన ఖనిజం. ఒక్కటి దక్కాలన్నా కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిందే.

Jadeite

World Most Expensive Mineral Jadeite : బంగారం, వెండి, ప్లాటినం,వజ్రం ఇవన్నీ ఖరీదైనవి. సాధారణంగా ఖరీదైనది,గొప్పదిగా బంగారాన్ని భావిస్తారు. బంగారంలాంటి మనిషి అని అంటుంటారు. అంటే సామాన్యులకే కాదు శ్రీమంతులకు కూడా బంగారం అంటే గొప్పగా భావిస్తుంటారు. కానీ బంగారం కంటే ఖరీదైనవి చాలానే ఉన్నాయి.ప్లాటినం, వజ్రం వంటివి. వజ్రం ఎంత ఖరీదైనదైనా అది బంగారంలో ఒదిగి ఉంటేనే దాని విలువ మరింత పెరుగుతుంది. డైమండ్ రింగ్, డైమండ్ హారం, డైమండ్ నెక్లెస్ ఇలా వజ్రం బంగారంలో ఒదిగితే దాని విలువ మరింత పెరుగుతుంది.

బంగారం, ప్లాటినం మాత్రమే అత్యంత ఖరీదైన ఖనిజాలు కాదు. దీనికంటే ఖరీదైన ఖనిజాలు భూమిపై చాలా ఉన్నాయి. రోథియం, పల్లాడియం, ఇరిడియం, జాడైట్ వంటివి బంగారం కంటే ఖరీదైనవి. అరుదైనవి కూడా. ఇవే కాకుండా మనం నేరుగా ఉపయోగించని చాలా ఖనిజాలున్నాయి. అవి బంగారం కంటే చాలా ఖరీదైనవి. వీటిలో లిథియం లాంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు అత్యంత ఖరీదైన ఖనిజంగా ‘జాడైట్’ ఖనిజం పేరొందింది.

జాడైట్ ఖనిజం రోథియం కంటే అత్యంత ఖరీదైనది. పలువురు శాస్త్రవేత్తలు జాడైట్ ఖనిజం అత్యంత ఖరీదైనదిగా చెబుతారు. జాడైట్ ఒక రకమైన రాయి. అది లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనిని ఖరీదైన ఆభరణాల తయారీలో ఉపయోగిస్తుంటారు. దీని ధర డైమండ్ లాగా క్యారెట్‌లలో ఉంటుంది. జాడైట్ క్యారెట్ ధర చాలా అధికం. ఒక క్యారెట్ జాడైట్ ధర 3 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ అని చెబుతారు. అంటే ఒక్క జాడైట్ రాయి కోసం కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.