Kachidi Fish Found by Fishermen in Kakinada
Kachidi Fish..Kakinada : ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మత్స్యకారుల పంట పండింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది. దీంతో గంగపుత్రులు ఆనంద వ్యక్తంచేశారు. తమకు గంగమ్మ తల్లి అదృష్టాన్నిచ్చిందంటు గంతులేశారు. సముద్రంలో కొన్ని అరుదైన జాతులకు చెందిన చేపలుంటాయి. అవి దొరికితే వారి పంట పండినట్లే. కొన్ని రకాల చేపల ధరలు రూ.లక్షల్లోనే పలుకుతూ ఉంటాయి. ఇలాంటి చేపలు పట్టుబడినప్పుడు మత్స్యకారుల పంట పడినట్లే. గోదావరి జిల్లాల్లో ఇలాంటి చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతూ ఉంటారు. మరి ముఖ్యంగా వర్షాకాలంలో మత్స్యకారులు తమ ప్రాణాలను పణ్ణంగా అదృష్టాన్ని పరిక్షించుకుంటారు. భారీ వర్షంలో కూడా సముద్రంలో చేపల వేటకు వెళతారు. అలా గంగపుత్రుల సాహసానికి ప్రతిఫలంగా ఒక్కోసారి వారి వలకు అరుదైన చేపలు చిక్కితుంటాయి.
తాజాగా కాకినాడ మత్స్యకారులకు అరుదైన చేప చిక్కింది. కుంభాభిషేకం రేవులో మత్స్యకారుల వలకు 25 కేజీల బరువు గల కచిడి చేప దొరికింది. దీన్ని వేలం వేయగా చేపలను కొనుగోలు చేసే వ్యాపారులు రూ.3.30వేలకు ఈ చేప కొనుగోలు చేశారు. అత్యంత అరుదుగా లభించే కచిడి చేపలో అనేక ఔషధ గుణాలు లభిస్తాయి. అందుకే ఈ చేపలకు లక్షల్లో డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు.
అనేక వ్యాధులకు తయారుచేసే ఔషధాల్లో కచిడి చేపను ఉపయోగిస్తారు. పిత్తాశయం, ఊపిరితిత్తుల మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కచిడి చేప నుంచి తీసే పదార్థాలతో డాక్టర్లు ఆపరేషన్ చేసిన తరువాత వేసే కుట్లుకు దారం తయారు చేస్తారట. ఎన్నో అనారోగ్యాలకు మంచి ఔషధంగా ఈ చేప ఉపయోగపడుతుంది. దీనిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.