Vijayapura : కరెంట్ ఇవ్వలేదని మొసలిని తీసుకొచ్చి కరెంట్ ఆఫీసులో వదిలిన రైతులు

విద్యుత్ కోతలను నిరసిస్తు రైతులు వితనూత్నంగా తమ నిరసనలను వ్యక్తంచేశారు. రైతులు ట్రాక్టర్ పై ఓ మొసలిని తీసుకొచ్చి హెస్కామ్ సబ్ స్టేషన్ లో వదిలారు.

Karnataka farmers protests over current cutting crocodail (1)

Karnataka farmers innovative protests over current cutting : కర్ణాటకలో కరెంట్ కోతలు తీవ్రమయ్యాయి. దీంతో రైతులంతా అల్లాడిపోతున్నారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. కరెంట్ కోతలను నిరసిస్తు రైతులు ధర్నా నిర్వహించారు. ఎండిపోయిన పంటలను తీసుకుని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. రాయచూర్ లో భారీ సంఖ్యలో రైతులు కరెంట్ కోతలకు నిరసనతగా ఎండిపోయిన పంటల మోపులతో విద్యుత్ కార్యాయలం ముందు ధర్నా చేపట్టారు. కార్యాయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. సౌమ్యంగా ఉండే రైతులకు ఆగ్రహం కలిగితే ఎలా ఉంటుందనేదానికి నిదర్శనంగా రాయచూర్ లో రైతులు పోలీసుల్ని నెట్టివేసి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు శతవిధాల యత్నించారు.

దీంట్లో భాగంగా విద్యుత్ కోతలను నిరసిస్తు విజయపురలో రైతులు వితనూత్నంగా నిరసనలను వ్యక్తంచేశారు. విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోనిహాల్ గ్రామంలోని రైతులు ట్రాక్టర్ పై ఓ మొసలిని తీసుకొచ్చి హెస్కామ్ సబ్ స్టేషన్ యూనిట్ ఆవరణలో వదిలారు. ఈ మొసలి తోకకు ఓ తాడు. మెడకు ఓ తాడు వేసి కాసేపు మొసలిని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో వదిలి తమ నిరసనను వ్యక్తంచేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతు..రాత్రి సమయంలో కరెంటు ఆసల్యంగా ఇస్తున్నారని..చీకట్లో పొలాలకు వెళితే పాముకాట్లకు గురయ్యే ప్రమాదాలున్నాయని అలాగే విద్యుత్ షాక్ లకు గురయ్యే అవకాశాలున్నాయని వాపోయారు. చీకట్లో పొలాలకు వెళ్లి నీరందిస్తే ఎలా అని రైతులు వాపోయారు. చీకట్లో జలచరాల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. వాపోయారు. కరెంట్ ఇచ్చేదే తక్కువ..పైగా ఆ ఇచ్చే కొంతసేపు రాత్రి సమయాల్లోఇస్తున్నారు అంటూ మండిపడ్డారు.

మాకున్న ఈ సమస్యలను అధికారులు తెలియజేసేందుకు మొసలిని తీసుకొచ్చామని తెలిపారు. కాగా రాత్రి పొలంలో తిరుగుతుండగా మొసలి కనిపించడంతో పట్టుకుని ట్రాక్టర్ ద్వారా విద్యుత్తు సబ్ స్టేషన్ కు తీసుకొచ్చామని తెలిపారు. చివరకు అటవీశాఖ అధికారులు రైతులను ఒప్పించి మొసలిని తీసుకెళ్లారు.