Leopard Attacks Dog : ఓర్నాయనో .. చావు పక్కకొచ్చి పలకరించిపోయింది భయ్యా..

చావు హాయ్ చెప్పి వెళ్లిపోయింది ఓ యువకుడికి. పక్కకే వచ్చి పలకరించిపోయింది. తన కళ్లెదుటే చిరుతను చూసిన అతనికి జరిగిందేంటో అర్థం అయ్యేసరికి దిమ్మతిరిగిపోయింది.

Leopard attacks

Leopard attacks street dog : చావు వెంట్రుక వాసిలో తప్పిపోయింది అంటారే..అచ్చం అలాగే జరిగింది పూణె-నాసిక్ జాతీయ రహదారిపై. చావు హాయ్ చెప్పి వెళ్లిపోయింది ఓ యువకుడికి. రోజంతా కష్టపడ్డాడేమో బయటే మంచంమీద నిద్రకు ఉపక్రమించాడు ఓ వ్యక్తి. అక్కడ కొన్ని లారీలు పార్క్ చేసి ఉండటం చూస్తుంటే బహుశా అతను ఏ లారీ డ్రైవరో క్లీనరో అయి ఉంటాడనిపిస్తోంది.

రోజంతా కష్టపడి కాస్త వీలు చిక్కేసరికి ఓ కునుకు తీద్దామనుకుని అక్కడే ఉన్న ఓ మంచంపై నిద్రపోతున్నాడు. దుప్పటి కప్పుకున్నాడు. నిద్రపోదామని తలపైకి దుప్పటి లాక్కుంటుండగా వచ్చింది ఎక్కడినుంచో ఓ చిరుతపులి..అతని పక్కనే ఓ తెల్ల కుక్క కూడా నిద్రపోతోంది. నిద్రపోదామనుకుంటు దుప్పటి తలమీదకు లాక్కుంటుండగా అతని వెనుక ఉన్న లారీల పక్కనుంచి ఓ చిరుతపులి వచ్చింది. అటు ఇటు చూసింది. నెమ్మదిగా అని వెనకాలకు వచ్చింది. కానీ అతను చిరుతను చూడలేదు.

నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటు ముందుకొచ్చిన చిరుత వస్తూనే శునకాన్ని చూసింది. నేరుగా దాని దగ్గరకు వెళ్లింది..కాలితో దాన్ని కదిపినట్టే కదిపి అది లేచి అరిచేసరికి నోటితో కరుచుకొని ఉడాయించింది. నిద్రపోతున్న కుక్క అరుపులకు మంచంపై పడుకున్న వ్యక్తి లేచి చూడగా, చిరుతపులి కుక్కను నోటకరచుకుని పారిపోతోంది. అది చూసినఅతనికి దిమ్మ తిరిగిపోయింది. పక్క పక్కనే కుక్కా మనిషి ఉండగా కుక్కపైనే చిరుత చూపు పడటం వల్ల అతనికి ఇంకా ఈభూమ్మీద నూకలు ఉన్నాయనిపించింది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ షేర్ చేసిన ఈ వీడియో చూస్తే ‘చావు పక్కకి వచ్చి పలకరించిపోయింది భయ్యా’అనిపిస్తోంది. సాధారణంగా చిన్న అలికిడికే కుక్కలు పసిగట్టేస్తాయి. కానీ ఆ కుక్కకు చావు దగ్గరపడి చిరుత రాకను గుర్తించలేకపోయింది.ఫలితంగా ప్రాణాలు పోగొట్టుకుంది. ఆ దృశ్యం చూసిన ఆ వ్యక్తికి బహుశా ఆ రాత్రే కాదు నిద్రపోదామనుకున్నప్పుడల్లా గుర్తుకొచ్చేలా ఉంది. చిరుత పులులు శునకాలను ఇష్టపడతాయని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వాన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ వీడియోపై..మీరు కూడా అదే అనుకుంటారు చావు పక్కకొచ్చి పలకరించిపోయింది భయ్యో అని..