Madhya Pradesh CM Mohan Yadav : సీఎం కత్తి పట్టి విన్యాసాలు చేస్తే ఎలా ఉంటుంది..? అదికూడా రెండు చేతులతో రెండు కత్తులు పట్టుకుని మెరుపు వేగంతో తిప్పుతుంటే చూసేందుకు భలే తమాషాగా ఉంటుంది. సీఎం ఏంటీ..? కత్తి పట్టటమేంటి..? అనుకుంటున్నారా..? నిజమే మధ్యప్రదేశ్ బీజేపీ నేత మోహన్ యాదవ్ గతంలో చేసిన కత్తి విన్యాసాలు ఆయన సీఎంగా ఎన్నికైన తరువాత సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ వీడియో పాతదే అయినా.. మోహన్ యాదవ్ తాజాగా మధ్యప్రదేశ్ సీఎంగా ఎన్నికైన క్రమంలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సీఎం మోహన్ యాదవ్ రెండు చేతులతోను కత్తులను మెరుపువేగంతో తిప్పుతున్నారు. ఎక్కడా ఏమాత్రం తడబడకుండా అత్యంత చాకచక్యంతో కత్తులతో చేసిన విన్యాసాలు ఆయన సీఎంగా ఎన్నికైన శుభతరుణంలో వైరల్ అవుతోంది.
కాగా..తెలంగాణ, ఛత్తీస్ గఢ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్,మిజోరాం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఛత్తీస్ గఢ్,రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసింది. ఈ మూడు రాష్ట్రాలకు సీఎం అభ్యర్ధులను కూడా తాజాగా అధికారికంగా ప్రటించింది. దీంతో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్‌లో మంత్రిగా పనిచేసిన మోహన్ యాదవ్‌ను బీజేపీ అధిష్టానం సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో మోహన్ యాదవ్ ఈరోజు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తున్న ఈ శుభ తరుణంలో గతంలో కత్తులతో ఆయన చేసిన విన్యాసాలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Meet Mohan Yadav the New CM of Madhya Pradesh.pic.twitter.com/B9pjqMy56B
— Ravinder Kapur. (@RavinderKapur2) December 11, 2023