Malaysia : స్కూలుకు వెళ్లనని మారాం చేసే ఐదేళ్ల కూతురికి తల్లిదండ్రులు మెర్సిడెస్‌ బెంజ్‌ కారు గిఫ్ట్‌ ..

చాక్లెట్స్ కొనిస్తాను, ఐస్ క్రీమ్ కొంటాను. నీకిష్టమైన బొమ్మలు కొనిస్తాను స్కూలుకెళ్లమ్మా అని బతిమాలి మరీ పంపిస్తారు అమ్మానాన్నలు. కానీ ఈ అమ్మానాన్నలు మాత్రం ఐదేళ్ల కూతురికి కోట్లు విలువ చేసే కారు కొనిచ్చారు.

parents gift 5 years daughter mercedes car

Malaysia : అమ్మా స్కూలుకు వెళ్లను అంటూ పిల్లలు మారాం చేయటం కామనే. చాక్లెట్స్ కొనిస్తాను, ఐస్ క్రీమ్ కొంటాను. నీకిష్టమైన బొమ్మలు కొనిస్తాను స్కూలుకెళ్లమ్మా అని బతిమాలి మరీ పంపిస్తారు అమ్మానాన్నలు. లేదా నిన్ను ఎగ్జిబిషన్ కు తీసుకెళతాం అంటూ ఆశపెడతారు. కానీ చిన్న పిల్లలకు చాక్లెట్లు, బొమ్మలు, ఐస్ క్రీములు కొనివ్వటం కామన్ అనుకున్నారేమో లేదా మా రేంజే వేర్ అనుకున్నారో గానీ స్కూలుకెళ్లనని మారాం చేసే తమ ఐదేళ్ల కూతరికి ఏకంగా రూ.కోట్లు విలువు చేసే మెర్సిడెజ్ బెంజ్ కారు కొనిస్తాం అని ఆశపెట్టారు. ఆశ పెట్టటమే కాదు ఏకంగా మెర్సిడెజ్ బెంజ్ కారు గిఫ్టు ఇచ్చారు మలేషియాకు చెందిన దంపతులు…!

మలేషియాకు చెందిన పారిశ్రామిక వేత్త ఫర్హానా జహ్రాకు ఫాతిమా కూతురు ఉంది. ఫాతిమా వయస్సు ఐదేళ్లు. ఒక్కతే కూతురు..కోట్ల ఆస్తి ఉంది. ఇంకేముంది బిడ్డను బంగారు పళ్లెంలో పెంచుకుంటున్నారు. అడిగిందల్లా కొనివ్వటం కోరింది క్షణాల్లో కళ్లుముందుంటం వారికి ముద్దుగా ఉండేది. తమ చిట్టితల్లి ముఖంలో ఆనందం కోసం ఏమైనా చేశేవారు అమ్మానాన్నలు. బిడ్డ అలిగిందంటే అల్లాడిపోయేవారు. అటువంటిది ఫాతిమాకు అనారోగ్యం చేస్తే ఇక వారి మనస్సు ఎంతగా తల్లడిల్లిపోతుంది ఊహించుకోవచ్చు.

అలా ఫాతిమాకు అనారోగ్యం చేసింది. దీంతో స్కూల్‌ వెళ్లటం మనేసింది. కొన్ని రోజులకు ఆరోగ్యం కుదుట పడింది. స్కూల్ కు వెళ్లే సమయం వచ్చింది. కానీ ఫాతిమా స్కూల్ కు వెళ్లనని మారాం చేసింది. చదువు పాడైపోతుందమ్మా..స్కూల్ కు వెళ్లాలి అని అమ్మానాన్నలు బతిమాలారు.అయినా ఫాతిమా వినలేదు. గాయాల కూతురు కదా. దీంతో నువ్వు స్కూలుకు వెళితే నీ పుట్టిన రోజుకు మంచి గిఫ్ట్ కొనిస్తాం అని ఆశపెట్టారు. ఏం కొనస్తారు అని అడిగింది చిన్నారి ఫాతిమా..నీకు ఏం కావాలో అడుగు అంటూ ఛాన్స్ చిట్టితల్లికే వదిలేశారు అమ్మానాన్నలు. దీంతో ఫాతిమా నాకు బీఎండబ్ల్యూ (BMW) కారు లేదా మెర్సిడెస్‌ జి వ్యాగన్‌ (Mercedes G Wagon) కావాలని కోరింది. నేను అడిగిన కారు కొనిస్తే స్కూల్ కు వెళతానని పట్టుబట్టింది. ఆ కోరిక వింటే సామాన్యులకు కాదు ఓ మాదిరి శ్రీమంతులకు కూడా దిమ్మ తిరిగిపోతుంది.

కానీ ఫర్హానా జహ్రా పారిశ్రామిక వేత్త..తప్పకుండా కొనిస్తాను తల్లీ స్కూలుకు వెళితే అంటూ వాగ్దానం చేసేవారు. ప్రామిస్ అని అమాయకంగా అడిగిన ముద్దుల కూతురు అడగ్గా నిజ్జంగా బంగారం కొనస్తా అంటూ ముద్దు పెట్టి మరీ ప్రామిస్ చేశారు. అలా ఫర్హానా కూతురు పుట్టిన రోజు బహుమతిగా రూ.3 కోట్లకుపైనే విలువ చేసే మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కొనిచ్చారు. ఇక అప్పటి నుంచి ఫాతిమా రోజూ స్కూల్ వెళుతోంది. ఇటువంటి వార్త దొరికితే వైరల్ అవ్వకుండా ఉంటుందా మరి..స్థానిక మీడియా ఈ వివరాలు ప్రచురించటంతో అదికాస్తా వైరల్ గా మారింది. కాగా ఫాతిమాకు ఓ చిట్టి చెల్లి కూడా ఉంది..