Nagaland minister Temjen Imna
Nagaland Minister Temjen Imna : నాగాలాండ్ మంత్రి తెమ్జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటారు. పలు ఆసక్తికర విషయాలను తన ట్విట్టర్ లో షేర్ చేస్తుంటారు. నెటిజన్స్ అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో చమత్కారంగా సమాధానాలు ఇస్తుంటారు. అటువంటి మంత్రిగారికి ఓ కుర్రాడి నుంచి ఓ విచిత్రమైన అభ్యర్థనతో కూడిన కోరిక కోరాడు.
సాధారణంగా మంత్రుల్ని..ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలను తమ గ్రామాల్లో ఉండే సమస్యల్ని తీర్చమని కోరుతుంటారు. రోడ్లు వేయించాలని తాగునీరు, సాగు నీరు వసతులు కల్పించాలనో లేదా ఉద్యోగం ఇప్పించాలనో కోరుతుంటారు. కానీ అరబింద పాండా అనే ఓ కుర్రాడు మాత్రం మంత్రి తెమ్జెన్ ఇమ్నాను ఓ వినూత్న కోరిక కోరాడు. అదేమంటే ..‘సర్ నేను అక్టోబర్ 31న నా డ్రీమ్ గర్ల్ తో మొదటిసారి డేటింగ్ కు వెళుతున్నాను..కానీ నాకు ఉద్యోగం లేదు నాకు ఏదైనా సహాయం చేయండి’ అంటూ మెయిల్ ద్వారా కోరాడు.
దానికి మంత్రిగా స్వయంగా సమాధానమిస్తు ‘”బటావో మెయిన్ క్యా కరూ’’ అంటే నేను మీకు ఏవిధంగా సహాయ పడగలను అనే స్టైల్లో ‘నేనేం చేయాలో చెప్పండి’ అని అడిగారు. ఈ వినూత్న పోస్టుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేశారు. ఒకరు ఆ వ్యక్తి స్థానంలో తెమ్జెన్‌ను డేట్‌కు వెళ్లమనగా.. మరికొందరు ఆ లవర్ బాయ్‌ను ఎమ్మెల్యే చేయండంటూ కామెంట్స్ చేశారు. ఇంకొందరు ఆ అబ్బాయికి ఉద్యోగం వచ్చేలా చూడాలని కోరారు.