Mini Pink Bullet : బుల్లి బుల్లెట్ బండి భలే ఉందే .. !!
రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోతున్న ఓ బుజ్జి బుల్లెట్ బండి తెగ ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ మినీ బుల్లెట్ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది.
Mini Pink Bullet Viral video : రోడ్డు మీద వెళుతుండగా ఏదైనా బైక్ గానీ ..కారు గానీ వెరైటీగా కనిపిస్తే ఠక్కున అందరి చూపు వాటిమీదే పడుతుంది. అటువంటి ఓ బుల్లి బైక్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. పింక్ కలర్ ఉంటే ఓ బుజ్జి బుల్లెట్ బండి చూసేవాళ్లను కళ్లు తిప్పుకోనివ్వటంలేదు. అంత క్యూట్ గా ఉంది.
సాధారణంగా బుల్లెట్ బైక్ మాంచి సాలీడ్ గా హుందాగా కనిపిస్తుంది. కానీ..బుల్లెట్ బుజ్జి బుజ్జిగా ముద్దు ముద్దుగా కనిపిస్తు చూపరులను ఆకట్టుకుంటోంది. భారతదేశంలో క్రియేటర్స్ కు కొదవేలేదని ఇప్పటికే ఎన్నో వినూత్న వాహనాల తయారీదారులు నిరూపించారు. తాజాగా ఢిల్లీ వీధుల్లో హల్ చల్ చేస్తున్న ఈ బుజ్జి బుల్లెట్ బండి వివరాలేంటో చూసేద్దాం రండి..ఆనక బుజ్జి బుల్లెడ్ బండి వీడియోపై కూడా ఓ లుక్కేద్దాం..
ఢిల్లీ వీధుల్లో ఒక మినీ బుల్లెట్ పింకీ రోడ్లమీద వెళ్లేవారిని తెగ ఆకట్టుకుంటోంది.ఇన్‌స్టా యూజర్ రామ్మీ రైడర్ సైకిల్ కంటే చిన్నగా ఉన్న మినీ బుల్లెట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలోషేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు..ఇది రోడ్డుమీద దూసుకుపోతుంటే తోటి వాహనదారులు చూడకుండా ఉండలేకపోతున్నారు. సెల్పీలు, ఫోటోలతో సందడి చేస్తున్నారు. వావ్ అంటూ ఆశ్చర్యపోతున్నారు. మినీ బుల్లెట్ వ్యక్తితో దాని వివరాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ బండి వంక మురిపెంగా చూస్తున్నారు.
ఢిల్లీ వీధిలో ఓ వ్యక్తి పింక్ కలర్ లో ఉండే ఓ మినీ బుల్లెట్ నడుపుతున్న వీడియో ఇన్ స్టాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోకు లక్షల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వేల సంఖ్యలో లైకులు కూడా వచ్చి పడుతున్నాయి. బుజ్జి బండి భలే అందంగా ఉంది…సూపర్ బుల్లెట్ లాంటి కామెంట్లు వెల్లువెత్తాయి. “బార్బీ బుల్లెట్ ఇట్స్ సో క్యూట్’, నాకూ కావాలి అని ఒకరంటే.. యాక్సిడెంట్ జరిగినా..ఈ బైక్‌తో ప్రాణాలు పోయే అవకాశాలు తక్కువ అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. మరి ఈ పింక్ బుజ్జి బుల్లెట్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండీ..మీకు కూడా కచ్చితగా నచ్చే తీరుతుంది.వావ్ అని అనకుండా ఉండలేరని గ్యారెంటీ..