stoneman willie funeral
Stoneman Willie : 128 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తిని ఇప్పుడు అంత్యక్రియలు చేయనున్నారు. 1895 నవంబర్ 19న చనిపోయిన వ్యక్తిని వచ్చే శనివారం అంటే అక్టోబర్ (2023)7న అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అతనో చిన్న దొంగ. జైలులో ఉండగా కిడ్నీ సమస్యలతో చనిపోయాడు. కానీ అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించటానికి జైలు అధికారులకు, పోలీసులకు అతని వివరాలు తెలియలేదు.ఎందుకంటే అతను తన నిజమైన పేరును చెప్పలేదు. దీంతో మృతదేహాన్ని అతని బంధువులకు అప్పగించేందుకు కుదరలేదు.దీంతో మృతదేహాన్ని మమ్మీగా మార్చి భద్రపరిచారు.
ఆనాటి నుంచి ఆ మమ్మీ సురక్షితంగా ఉంది. అతను ధరించిన సూటు,టై ఇప్పటికీ అలాగే ఉండటం గమనించాల్సిన విషయం.అతని వెంట్రుకలు,దంతాలు కూడా చెక్కుచెదరలేదు. అమెరికాలోని పెన్నసిల్వేనియా జైలులో మరణించిన ఆ దొంగ మృతదేహాన్ని అధికారులు టెక్నాలజీతో మమ్మీగా మార్చారు. దీంతో అమెరికాలోని చిన్న నగరమైన రీడింగ్ లో గత 128 ఏళ్లుగా భద్రంగా ఉన్న ‘స్టోన్‌మ్యాన్ విల్లీ’గా పిలుస్తున్నారు. ఈ మమ్మీకి వచ్చే శనివారం (అక్టోబర్ 7న) అంత్యక్రియల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమెరికాలోని పెన్సిల్వేనియా జైలులో ఓ దొంగ కిడ్నీలు పూర్తిగా పాడైపోయిన 1895 నవంబర్ 19న చనిపోయాడు. అతని మృతదేహాన్ని బంధువులకు అప్పగించేందుకు జైలు అధికారులు చాలా ప్రయత్నాలు చేశారు.అతనిని జైలుకు తీసుకొచ్చిన సమయంలో నమోదు చేసుకున్న వివరాలతో అతని బంధువుల గురించి అన్వేషించారు. అప్పుడే తెలిసింది వారికి విచారణలో ఆ దొంగ తన పేరుకు బదులుగా వేరే పేరు చెప్పాడని. దీంతో అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే అధికారుల యత్నాలు ఫలించలేదు. దీంతో వారు మృతదేహం ఫ్యునరల్ హోమ్‌కు చేర్చారు. ప్రభుత్వం అనుమతితో అక్కడి సిబ్బంది అప్పట్లో వారికి ఉన్న కొద్దిపాటి పరిజ్ఞానంతో మృతదేహాన్ని మమ్మీగా మార్చేశారు. ఆ మమ్మీని ప్రదర్శనలు ఉంచేవారు. ఈ మమ్మీని చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు.
సూటు, బూటు ధరంచి ఉన్న మమ్మీని చాలా ఆసక్తిగా చూసేవారు. 128 ఏళ్లు దాటినా ఈ మమ్మీ వెంట్రుకలు, దంతాలు చెక్కు చెదర్లేదు. కొన్ని పురాతన దస్త్రాలు, అత్యాధునిక సాంకేతికత సాయంతో విల్లీకి ఐరిష్ మూలాలున్నాయని అధికారులు ఇటీవల కనుగొన్నారు. కానీ ఇక మమ్మీకి తామే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగా వచ్చే శనివారం రీడింగ్ వీధుల గుండా మమ్మీ అంతిమయాత్ర నిర్వహించేందుకు ఏర్పాటుచేస్తున్నారు.