Meerut Commissioner pet Dog Missing
Meerut commissioner dog missing : ఓ కుక్క తప్పిపోయింది. ఆ తప్పిపోయింది ఓ కమిషనర్ గారి కుక్క. ఇంకేముంది నగరంలో పోలీసులు రంగంలోకి దిగారు. నగరమంతా జల్లెడపట్టేశారు. పోలీసులకు ఇంకే పనులు లేనట్లు..ఏ కేసుల దర్యాప్తులు లేనట్లుగా కమిషనర్ గారి కుక్కను వెతికేపనిలో పడ్డారు మీరట్ పోలీసులు. నిద్రాహారాలు మాని 36 గంటలు కమిషనర్ గారి కుక్కును వెతికే పనిలో బిజీ అయిపోయారు. అయినా పాపం ఆకుక్క ఆచూకి తెలియరాలేదు.
ఇంతకీ ఎవరా కమిషనర్ అంటే..ఆమె పేరు సెల్వకుమారి. మీరట్ మున్సిపల్ కమిషనర్. ఆమె జర్మన్ షెపర్ట్ జాతికి చెందిన కుక్కను పెంచుకుంటున్నారు. ఆ కుక్క అంటే ఆమెకు చాలా చాలా ప్రేమ. ఇలాంటి కుక్కలు మీరట్ నగరం మొత్తంమీద 19 మాత్రమే ఉన్నాయట. ఈక్రమంలో గత ఆదివారం (జూన్ 25,2023) సాయంత్రం 6 గంటల నుంచి కమిషనర్ గారి జర్మన్ షెపర్ట్ కుక్క కనిపించకుండా పోయింది.
Stray Dogs : చెప్పులు ఎత్తుకెళ్లాయని కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించిన మాజీ మేయర్
కమిషనర్ ఇంట్లో సెంట్రీ గా పనిచేస్తున్న సిబ్బంది తెగ కంగారుపడిపోయారు. ఆచుట్టుపక్కల అంతా వెదికారు. కానీ కనిపించలేదు. మేడమ్ ఏమంటారోనని భయపడ్డారు. కానీ విషయం ఎట్టకేలకు మేడమ్ దష్టికి వచ్చింది. దీంతో సిటీలో ఆనిమల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేస్తున్న డాక్టర్ హర్పాల్ సింగ్ అర్ధరాత్రి కమిషనర్ ఇంటికి చేరుకుని కమిషనర్ పెంపుడు శునకం పేరు, ఫొటో వివరాలు తీసుకుని స్వయంగా వెతకడం మొదలు పెట్టారు.
అయినా ఉపయోగంలేకుండా పోయింది. ఎవరైనా కావాలనే ఎత్తుకెళ్లిపోయారనే అనుమానంతో సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలించారు.. అయినా కమిషనర్ పెంపుడు కుక్క మాత్రం దొరకలేదు. కానీ స్థానిక మీడియా కథనాల ప్రకారం ఆ కుక్క దొరికినట్లుగా తెలుస్తోంది.