Rajasthan Man marrage Letter
Rajasthan Man marrage Viral Letter : నాకు పెళ్లి చేసి పుణ్యం కట్టుకోండి సార్..అని కోరుతు ఓ వ్యక్తి అధికారులకు లెటర్ రాశాడు. అమ్మాయి ఎలా ఉండాలో కూడా వివరిస్తు రాసిన లెటర్ చదివిన అధికారులు షాక్ అయ్యారు. రాజస్థాన్ లోని దౌసా జిల్లా బహరవాండా బ్లాక్ లోని ముఖ్యమంత్రి సహాయక శిబిరానికి జూన్ 3న ఓ లెటర్ వచ్చింది. దాంట్లో ఓ వ్యక్తి తను పెళ్లి చేసుకోవాలనకుంటున్నానని తనకు ఓ పిల్లను చూసి పెట్టండి అంటూ అమ్మాయి ఎలా ఉండాలో వివరిస్తు ఓ వ్యక్తి రాసిన లేఖ చదివిన అధికారులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
సిక్రాయ్ సబ్ డివిజన్ లోని గంగాద్వాడి గ్రామానికి చెందిన కల్లు మహావీర్ అనే వ్యక్తి లేఖ రాశాడు. తనకు 40 ఏళ్లని..తనకు ఇంకా పెళ్లికాలేదని…ఇంటిపనులు బయటి పనులు చేసుకోలేకపోతున్నానని తనకో అమ్మాయిని వెతికిపెడితే పెళ్లి చేసుకుని స్థిరపడతానని కోరాడు. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించాలని వినతి చేశాడు.
తనకు భార్యగా రాబోయే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలనూ మహావీర్ అందులో వివరిస్తు..అమ్మాయి తప్పనిసరిగా స్లిమ్ గా ఉండాలి,వయసు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి,ఇంటి పనులు చేయటంలో మంచి నైపుణ్యం ఉండాలి అంటూ వివరించాడు. ఈ లేఖను సోమవారం (జూన్ 6)ట్విట్టర్ లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.22,000 వ్యూస్ వచ్చాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ లో వందలమంది లైక్ చేశారు.