Site icon 10TV Telugu

Raksha bandhan 2023 : ప్రకృతి ఇచ్చి రాఖీలు .. నాచ్యురల్ రక్షాబంధన్ పువ్వులు

rakhi flower

rakhi flower

Raksha bandhan 2023 : అన్నా చెల్లెళ్ల మధ్య వాత్సల్యం, అక్కా తమ్ముళ్ల మధ్య అనురాగం చూసి ప్రకృతి మాత మురిసిపోయింది. ముగ్గురాలైపోయింది. వారి ప్రేమలో తాను కూడా మమేకమైపోవాలని ‘రాఖీ’రూపంలో ప్రకృతి మాత అందించిన ఈ అందమైన ముగ్థమోహన రూపమైన పువ్వుల్ని చూస్తే అర్థమవుతుంది. నక్షత్ర కాంతులీనే రాఖీ పువ్వుల్ని చూస్తే చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. వర్ణశోభిత అందాలతో..మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించి మమైరపించే గుభాళింపుల్లోను తమకు తామే సాటిగా ప్రకృతి అందించిన ఈ స్వచ్ఛమైన పువ్వులతో కట్టేద్దామా..? అన్నదమ్ములకు రక్షా బంధన్..?

పూలజాతిలో నిజంగా అద్భుతంగా అనిపిస్తాయి ఈ రాఖీ పువ్వులు. ఇవి తీగజాతికి చెందినవి. చిన్నపాటి పందిరి ఉన్నా..పాకేందుకు చిన్నపాటి ఆధారం ఉన్నా చక్కగా పాకేసి పువ్వులతో కనువిందు చేస్తాయి. కంటికి ఇంపైన రంగులు ఈ రాఖీ పువ్వుల సొంతం అంటే అతిశయోక్తి కాదు. వంకాయ రంగులో పూసినా..ఎర్రటి రంగులో పూసినా ఈ పువ్వులు చూపు తిప్పుకోనివ్వవు. పాదులా మనస్సు నిండా పాకి చక్కటి గుభాళింపుతో మనస్సును కట్టిపారేస్తాయి.

Raksha bandhan 2023 : పురాణాల్లో రక్షా బంధన్ .. ఎవరు ఎవరికి కట్టారో తెలుసా..?

ఈ రాఖీ పూలు శాస్త్రీయ నామం ‘ప్యాసిప్లొరా’. వీటిని ఎక్కడ వేస్తే అక్కడ పాదు చక్కగా ఎగబాకి నక్షత్రాల్లాంటి పువ్వులు పూస్తాయి. పూలకు చుట్టూతా సన్నటి కేసరాల్లాంటి నూరు రేఖలు ఉంటాయి. పువ్వు పైన మధ్య భాగంలో ఐదు పెద్ద రేఖలు ఉంటాయి. అందుకే వీటిని ‘కౌరవ-పాండవ’ పుష్పాలు అని పిలుస్తారు. రాఖీలా కనిపిచే రక్ష బంధన్ పూలగాను వీటికి మంచి పేరు.

ఇవి రకరకాల రంగుల్లో, రూపాల్లో పువ్వులు పూసే మొక్కలు. చూడ్డానికి రాఖీల్లా ఉండటంతో వీటిని ‘రాఖీ’ పూలమొక్కలనీ పిలుస్తారు. సాయంత్రం నాలుగు దాటితే రాఖీ పువ్వుల ఘాటైన వాసనలతో మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. వీటి సువాసన చాలా దూరం వరకు వెదజల్లుతాయి. దీంతో ఎక్కడనుంచి వస్తోంది ఈ గుభాళింపు అంటూ ఆ వాసకు ఒక్కసారి గుండెల నిండా పీల్చుకోవాలనిపిస్తుంది.

Rakhi For Soldiers : 21 మంది వీరజవాన్ల చిత్రాలతో 27 అడుగుల రాఖీ .. భారత్‌కు రక్షణ కవచంలా నిలిచే సైనికుల కోసం

ఈ మొక్క నుంచి అనేక ఔషధాలు తయార చస్తారు. ఈ ఔషధాలను నిద్ర బాగా పట్టడానికి, మానసిక ఒత్తిడి తగ్గడానికి ఉపయోగిస్తారు. ప్రహరీగోడల మీద, ఇంటి పోర్టోకోల మీద, డాబా పిట్టగోడల మీద, పెంకుటిళ్ల మీద, చలువ పందిళ్ల మీద ఈ పాదు చక్కగా అల్లుకుంటుంది. వాటి పూలు ఇంటికి మరింత శోభనిస్తాయి. బాల్కనీల్లో పెంచుకంటే మంచి సువాసనతో ఇంటిని ఆహ్లాదంగా ఉంచుతాయి.

Exit mobile version