Rakhi For Soldiers : 21 మంది వీరజవాన్ల చిత్రాలతో 27 అడుగుల రాఖీ .. భారత్‌కు రక్షణ కవచంలా నిలిచే సైనికుల కోసం

భారతీయుల ప్రేమ,బంధం ఇనుమడించి 27 అడుగుల భారీ రాఖీ భారత జవాన్ల కోసం రూపుదిద్దుకుంది. మీరు మీ రుణం తీర్చుకోలేమని కృతజ్ఞతా భావం, మీ వెన్నంటే దేశం యావత్తు ఉంటుందనే బంధానికి గుర్తుగా 27 అడుగుల రాఖీ భారత జవాన్ల కోసం దేశ సరిహద్దుల్లోని పంజాబ్ కు చేరింది.

27 feet rakhi made for Indian army jawans

Raksha bandhan 2023..Rakhi For Soldiers : రాఖీ పండుగ వస్తోందంటే చాలు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు అక్కచెల్లెళ్లు.. ఆనందంగా ఎదురు చూస్తుంటారు. సోదరుల రక్షే తమకు శ్రీరామ రక్ష అన్నట్లుగా భావిస్తారు. బంధాలకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బంధాలకు..బాంధవ్యాలకు భారత్ పెట్టింది పేరు. ఇక రక్షా బంధన్ వేడుక వస్తోంది అంటే అక్కాచెల్లెళ్ల సంతోషాలకు హద్దే ఉండదు. దేశాలకు అతీతంగా రక్షా బంధన్ పండుగ నిలుస్తోంది. అటువంటి రక్షా బంధన్ పండుగ రోజు దేశానికే రక్షణ కవచంలా నిలిచే భారత జవాన్లకు రాఖీ కట్టేందుకు భారత ఆడబిడ్డలు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తుంటారు. తమను తమ దేశానికి రక్షణ కవచంలా నిలిచి తమ ప్రాణాలను కూడా పణ్ణంగా పెట్టే వీర జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. త్యాగాలకు ప్రతీకగా నిలిచే వీర జవాన్ల కోసం ప్రత్యేకమైన రాఖీ(27 feet rakhi )ని తయారు చేస్తున్నారు ఛత్తీస్ గఢ్ (Chhattisgarh)లోని బిలాస్ పుర్ జిల్లాలోని సాయిమౌళి ఆలయ కమిటీ(bilaspur Saimouli Temple Committee )..

భారత దేశం కోసం తమ కుటుంబాలను వదిలేసి..దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయని వీర జవాన్ల కోసం భారత సైనికుల కోసం రక్షా బంధన్ పండుగ సందర్భంగా ప్రత్యేకమైన రాఖీని తయారు చేస్తున్నారు ఛత్తీస్​గఢ్​​లోని సాయిమౌళి ఆలయ కమిటీ. ఈ ప్రత్యేకమైన రాఖీలు ప్రతీ అంగుళం ప్రత్యేకలే కొలువై ఉన్నాయి. ఈ రాఖీ పొడవు 27 అడుగులు. వెడల్పు ఆరు అడుగులు.అంతేకాదు ఈ ప్రత్యేకమైన రాఖీలో 21 మంది వీరజవాన్ల చిత్రాలను ఏర్పాటు చేశారు. వారితో పాటు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu), ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi), రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ (Defense Minister Rajnath Singh)చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు.అంతేకాదు పరమవీర్ చక్ర విజేతల ఫోటోల(Paramvir Chakra winners)ను కూడా అమర్చారు. సాయిమౌళి ఆలయ కమి ఈ భారీ రాఖీని ఇప్పటికే జిల్లా సైనిక్ సంక్షేమ బోర్డు బిలాస్ పుర్ అధికారుల ద్వారా పంజాబ్ లోని ఉధంపుర్ కు (Udhampur inPunjab)తరలించింది.

Raksha bandhan 2023 : పురాణాల్లో రక్షా బంధన్ .. ఎవరు ఎవరికి కట్టారో తెలుసా..?

ఈ భారీ తయారీ గురించి కమిటీ సమన్వయ కర్త దిలీప్ దేవర్కర్ మాట్లాడుతు..దేశం కోసం రక్షణ కవచంలా నిలిచే జవాన్లకు వారి బంధువుల నుంచి రాఖీ రావటం కష్టం. కానీ వారు ఎప్పుడు సురక్షితంగా ఉండాలనే ఉద్ధేశంతో ఈ ప్రత్యేకమైన రాఖీని తయారు చేశామని..2022లో రెండున్నర అడుగుల వెడల్పు,15 అడుగుల వెడల్పుతో రాఖీ తయారు చేసి లద్ధాక్ కు పంపించామని..ఈ ఏడాది రాఖీ తయారీలో భిన్నంగా 27 జవాన్ల పేర్లతో పాటు ప్రధాని,రక్షణమంత్రి, రాష్ట్రపతి ఫోటోలను కూడా ఏర్పాటు చేసి పంజాబ్ సైనికులకు పంపించామని తెలిపారు.

ఈరోజు మనం మన మన ఇళ్లల్లో ప్రశాంతంగా జీవిస్తున్నాం అంటే దానికి కారణం దేశ సరిహద్దుల్లో మన జవాన్లు తమ ప్రాణాలకు పణంగా పెట్టి శతృవుల నుంచి మనకు రక్షణగా ఉండటమేనని కమిటీ సభ్యుడు రాజన్ పాఠే అన్నారు. మనకు రక్షణ కవచంలా నిలిచే జవాన్లకు రాఖీని రక్షగా పంపించటం మన బాధ్యత వారు రక్షణే దేశ రక్షణ వారికి రాఖీ పంపించటం మా అదృష్టంగా భావిస్తున్నామని..జవాన్లకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమని రాఖీ రక్షతో వారు సురక్షితంగా ఉండాలనే ఉద్యేశంతో ప్రతీ సంవత్సరం ఇలా ప్రత్యేక రాఖీలు తయారు చేసి జవాన్లకు పంపిస్తున్నామని తెలిపారు. దేశ ప్రజలు ఎప్పుడు మీరు సురక్షితంగా ఉండాలని అందరు మీ వెన్నంటే ఉంటారని ఈ రాఖీ గుర్తు చేస్తుందని అన్నారు.

కాగా  ఈ రాఖీలో 27మంది జవాన్ల పేర్లను భారత ప్రభుత్వం అండమాన్ నికోబార్ లోని దీవులకు పెట్టింది.ఈ రాఖీలో భారతదేశపు మువ్వన్నెల జెండా రంగులు కనువిందు చేస్తున్నాయి. ఇటు దేశ భక్తికి..అటు దేశ రక్షణకు ఈ భారీ రాఖీ ప్రతీకగా నిలుస్తోంది.

 

ట్రెండింగ్ వార్తలు