Rare big mushroom In Odisha
Rare big mushroom In Odisha : ఒడిశా (Odisha)లోని సంబల్పుర్ జిల్లా (Sambalpur)లోని ఖలియాముండా గ్రామంలో లూరి కిషన్ (Luri Kishan)అనే వ్యక్తి వ్యవసాయం పొలం ఉంది. దాంట్లో వ్యవసాయం చేస్తుంటాడు. పొలం గట్టుమీద రకరకాల కూరగాయలు, పూలు, పండ్ల మొక్కల్ని పెంచుతున్నాడు. ఈక్రమంలో ఆదివారం (జులై 23,2023)న పొలం పనులు చూసుకుని వస్తుండగా గడ్డివామి వద్ద ఓ వింత ఆకారం కనిపించింది. అదో పుట్టగొడుగు అని గుర్తించాడు. కానీ అంత పెద్ద పుట్టగొడుగు( big mushroom)ను మాత్రం అతను ఎప్పుడు చూడలేదు.దీంతో ఆశ్చర్యపోయాడు.
అది రెండు అడుగుల వెడల్పుతో దాదాపు 8 నుంచి 10 కిలోల వరకు బరువుంది. దానిని జాగ్రత్తగా తీసి ఇంటికి పట్టుకెళ్లాడు. ఇంత పెద్ద పుట్టగొడుగును గతంలో ఎప్పుడూ చూడలేదని అన్నాడు లూరి కిషన్. ఇది అరుదైన జాతికి చెందిన మష్రూమ్ (Rare big mushroom)అని భావిస్తున్నామని తెలిపాడు. గ్రామస్థులు సైతం ఇంత పెద్ద పుట్టగొడుగును చూసేందుకు తరలివచ్చారు.
కొన్నాళ్ల క్రితం..ఒడిశాలోని గంజాం జిల్లాలోని సూరాడ బ్లాక్ పరిధిలోని రత్నాపూర్ గ్రామంలో ఒక రైతు పొలంలో గడ్డికుప్ప కింద 10కిలోల బరువున్న పుట్టగొడుగు అందరిని ఆకర్షించింది. దాదాపు 2 కిలోల బరువున్న పుట్టగొడుగులు మొలకెత్తి.. అందరి దృష్టిని ఆకర్షించాయి. అలాగే కేరళలో కూడా ఇడుక్కి జిల్లా..అదిమలైకు చెందిన కవుమ్తాదతిల్ బేబీ పెరట్లో రెండు పుట్టగొడుగులు మొలకెత్తాయి. ఒక్కోక్కటి 2 కిలోల బరువు, రెండున్నర అడుగుల వెడల్పు ఉండటంతో వాటిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.