Dosa Sambar : దోసెలోకి సాంబార్ ఇవ్వని హోటల్‌‌కు జరిమానా..

ఆర్డర్ చేసిన మసాలా దోశ ఇచ్చారు కానీ సాంబార్ ఇవ్వలేదు. అందుకు భారీ మూల్యం చెల్లించుకుంది ఓ హోటల్. నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం అన్నట్లుగా వడ్డీతో సహా జరిమానా కట్టాల్సి వచ్చింది.

Lawyer Masala Dosa,sambar

Dosa Sambar Fine: మనం ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి దోసో లేదా ఇడ్లీయో ఆర్డర్ చేస్తాం. లేదా పార్శిల్ చేయించుకుంటాం. హోటల్ వరాు రెండు రకాల చట్నీలు, సాంబారుతో సర్వ్ చేస్తారు. లేదా పార్శిల్ చేస్తారు. ఒకవేళ చట్నీలు మాత్రమే ఇచ్చి సాంబార్ ఇవ్వకపోతే ఏం చేస్తాం.. పోనీలే మర్చిపోయాడనుకుంటాం.

కానీ ఓ న్యాయవాది మాత్రం అలా అనుకోలేదు. స్పెషల్ మసాలా దోశ (special masala dosa) ఆర్డర్ చేసిన పార్శిల్ కట్టించుకున్న న్యాయవాదికి దోశ ఇచ్చారు..దానికి బిల్లు రూ.140వేశారు. చట్నీ ఇచ్చారు కానీ సాంబార్ (sambar )ప్యాకెట్ ఇవ్వలేదు. దీంతో ఆయనకు కోపమొచ్చింది. మరి న్యాయవాది కదా ఊరికే ఉంటాడా ఏంటీ.. వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇది జరిగి 11 నెలలు అయ్యింది. తాజాగా సదరు రెస్టారెంట్ కు వినియోగదారుల కమిషన్ రూ.3,500లు జరిమానా విధించింది.

Chandrayaan-3 Launch : చంద్రయాన్-3 ప్రయోగానికి నాయకత్వం వహిస్తున్న రీతు కరిధాల్ ఎవరో తెలుసా? ఆమెకు ‘రాకెట్ ఉమెన్’ అనే పేరు ఎందుకొచ్చింది..

వినియోగదారుడిగా తనను సదరు హోటల్ మోసం చేసిందని తీసుకున్న డబ్బుకు సరిపడా ఆహారాన్ని ఇవ్వలేదు అంటూ బిహార్‌(Bihar)కు చెందిన మనీష్‌ పాఠక్‌ అనే న్యాయవాది (lawyer Manish Pathak) 11 నెల క్రితం వినియోగదారుల కమిషన్ (Consumer Commission)కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన కమిషన్ 11 నెలల విచారణ తరువాత రెస్టారంట్‌దే తప్పని నిర్ధారించింది. రూ.3500 జరిమానా విధించింది. ఈ జరిమానాను 45 రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది. లేదంటే 8 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.