Cat Job In Airport : ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుల్లో పిల్లికి ఉద్యోగం .. క్యాప్,యూనిఫాం ధరించి ఏం చేస్తుందో తెలుసా..?!

అదొక అందమైన పిల్లి. ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తోంది. క్యాప్ పెట్టుకుని, యూనిఫాం ధరించి చక్కగా డ్యూటీ చేస్తోంది. ఠీవీగా డ్యూటీ చేసే ఆ పిల్లికి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా చక్కగా మర్యాదు ఇస్తున్నారు.

Cat Job In International Airport

Cat Job InSan Francisco International Airport : ఈరోజుల్లో ఓ ఉద్యోగం రావాలంటే ఎంత కష్టపడాల్సి వస్తోందో కదా..కానీ జంతువులకు ఉద్యోగం రావటం ఈజీయేనేమో..ఏంటీ జంతువులకు ఉద్యోగమా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే..పోలీసు డిపార్ట్ మెంట్స్ లో నేరస్తుల గుర్తింపుకు డాగ్స్ ఎంతగా ఉపయోగపడుతున్నాయో తెలిసిందే. పోలీస్

ఓ పిల్లి ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తోంది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉద్యోగం చేస్తోంది ఓ పిల్లి. ఆ పిల్లికి ఎయిర్ పోర్టులో పనిచేసే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా గౌరవం ఇస్తున్నారు. చాలా మర్యాదగా చూస్తున్నారు. ఆ పిల్లి పేరు ‘డ్యూక్ ఎల్లింగ్టన్ మోరిస్’. ఎయిర్ పోర్టులో పనిచేసే సిబ్బందికి వారి వారి స్థాయిలకు తగినట్లుగా యూనిఫామ్స్ ఉంటాయి. వారికి టోపీలు కూడా ఉంటాయి అలాగే ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేసే ఈ పిల్లిగారికి కూడా యూనిఫాం ఉంది. నెత్తిమీద టోపీ, యూనిఫాంతో భలే ముద్దుగా కనిపిస్తోంది డ్యూక్ పిల్లి. చక్కగా టోపీ, యూనిఫామ్ తో ఠీవీగా అటు ఇటు తిరుగుతోంది డ్యూక్.

Donald Trump : అందరి బిల్లు నేనే చెల్లిస్తానని చెప్పి హోటల్ బిల్లు కట్టకుండా ఎస్కేప్ అయిన ట్రంప్.!

తెలుపు, నలుగు రంగుల్లో ముద్దుగా ఉన్న ఆ పిల్లిని చూసిన ఎయిర్ పోర్టులో ప్రయాణీకులు అది ఏ వీఐపీకి సంబంధించిన పెంపుడు పిల్లి అనుకున్నారు. కానీ అది అక్కడ ఉద్యోగి అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఈ పిల్లి చేసే ఉద్యోగం ఏంటో మరి అంటారా..? ఈ పిల్లిగారు చేసే పని ఏంటంటే..సాధారణంగా ఎవరైనా ఫస్టు టైమ్ విమానం ఎక్కేవారు భయపడతుంటారు. ఆ భయంతో వారు ఆందోళనకు గురి అవుతుంటారు. అటువంటివారి వల్ల ఎయిర్ పోర్టులో కొన్ని గందరగోళ పరిస్థితిలు వస్తుంటాయి. అటువంటి అనుభవాలు అక్కడ పనిచేసే ఉద్యోగులకు అలవాటే.. ఎన్నో సందర్భాలని వారు చూస్తుంటారు. కొంతమంది భయంతో బీపీ పెరిగిపోవటం..ఆందోళన పెరిగిపోయి చెమటలు పట్టేసి నానా ఇబ్బందులు పడుతుంటారు. అలా ప్రయాణీకుల మానసిక ఒత్తిడి తగ్గించటమే ఈ పిల్లిగారి డ్యూటీ..

అదేంటీ ప్రయాణీకులు ఆందోళనగా ఉంటే ఈ పిల్లి ఏం చేస్తుంది..? అనుకోవచ్చు. సాధారణంగా జంతువులతో ఆడుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని ఒత్తిడిని బయటపడొచ్చని నిపుణుడు చెబుతుంటారు. యూనిఫామ్ వేసుకుని, నెత్తిమీద టోపీ పెట్టుకుని తల విచిత్రంగా తిప్పుతు చూస్తున్న ఈ క్యూట్ గా ఉన్న ఈ పిల్లిని చూస్తే ఎవ్వరైనా సరే ఎంత ఆందోళనలో ఉన్నా సరే అదికాస్తా హుష్ కాకి అని ఎగిరిపోయేలా చేసేలా ఉంటుంది. దానితో కాసేపు టైమ్ స్పెండ్ చేయాలనిపిస్తుంది.దాంతో ఒత్తిడికి అంతా మర్చిపోతారు. హాయిగా దాంతో గడుపుతారు. అదే మని ఈ క్యూట్ పిల్లిగారి డ్యూటీ..అలా వారి ఆందోళన తగ్గించడమే ఈ పిల్లిగారి పని.

Germany Sword: జర్మనీలో మూడువేల ఏళ్లనాటి కత్తి లభ్యం.. దీని ప్రత్యేకత ఏమిటంటే ..

ఈ పిల్లితో కాసేపు గడిపితే ప్రయాణం గురించిన టెన్షన్ మొత్తం ఎగిరిపోతుందని, దీంతో భయపడకుండా ప్రయాణం పూర్తిచేయొచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల నెర్వస్ ను పోగొట్టేందుకు ఈ పిల్లికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చామని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు