Silver Wedding chappal : వధూవరుల కోసం వెండి చెప్పులు .. ముత్యాలు, రత్నాలతో డిజైన్

వెండితో తయారు చేసిన చెప్పులు తెగ వైరల్ అవుతున్నాయి. పెళ్లిలో రాయల్ లుక్ కోసం వెండి చెప్పులు కొనుక్కోవటానికి ముచ్చట పడుతున్నారు వధూవరులు.

Silver Wedding chappal

Silver Wedding chappal : డబ్బులున్న మహానుభావులు..వెండి చెప్పులు చేయించుకుంటున్నారు. పెళ్లంటే ఆమాత్రం ఉండాలి కదా అనుకుంటున్నారేమో వధు వరుల కోసం వెండితో చెప్పులు చేయించుకున్నారు. వెండి మాత్రమే ఉంటే చెప్పులు ఏం బాగుంటాయి..అందుకే వాటికి ముత్యాలు,రత్నాలతో డిజైన్ చేయించున్నారు. వధూవరుల వెడ్డింగ్ చెప్పులు అంటూ రకరకాల మోడల్స్ లో వెండి చెప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

300 నుంచి 500ల గ్రాముల వెండితో  చెప్పులు తయారు చేస్తున్నారు యూపీలోని లక్నోలో ఓ నగల వ్యాపారి. వెండిని బట్టి ఈ చెప్పుల విలువ ఉంటుంది.అలాగే ఆ చెప్పుల మీద డిజైన్ కోసం వినియోగించే ముత్యాలు, రత్నాలను బట్టి వాటి విలువ పెరుగుతుంది.రూ.25,000 నుంచి ఆ పైన ఈ చెప్పుల విలువ ఉంటుందని చెబుతున్నారు తయారీదారులు. సాధారణంగా సెలబ్రిటీలు ఇంతకంటే ఖరీదైనవే వినియోగిస్తుంటారు. లక్షల రూపాయల విలువ చేస్తుంటాయి వారు ధరించే చెప్పులు, బూట్లు వంటివి.కానీ వెండితో చేసిన పాదరక్షలు అంటే కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి. ఉత్తరప్రదేశ్‌లోని లఖ్ నవూలో ఓ నగల వ్యాపారి వెండి చెప్పులు తయారు చేస్తున్నారు. వధువుకు, వరుడికి వేరు వేరు డిజైన్లతో చెప్పులు చేస్తున్నారు.

Names of Rains : వానల్లో ఎన్ని రకాలున్నాయో తెలుసా..? వాటి పేర్లు, అర్థాల్లో ఆసక్తికర విషయాలు..

కొంతమంది తమ షాపుకు వచ్చినప్పుడు వెండి చెప్పుల గురించి అడగుతుంటారని. అందుకే ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది అందుకు వరుడు, వధువుల కోసం చెప్పులు తయారు చేస్తున్నామని ఆర్డర్ ను బట్టి ఇది వారి వారి సైజులకు తగినట్లుగా తయారు చేస్తున్నామని తెలిపారు నగల షాపు యజమాని వినోద్ మహేశ్వరి. వధువు, వరులకే కాకుండా చిన్నపిల్లలకు కూడా వెండి చెప్పులు తయారు చేస్తున్నామని తెలిపారు.

ఈరోజుల్లో వరుడు షేర్వాణీలు ధరించటం సర్వసాధారణంగా మారిపోయింది. షేర్వాణికి తగిన మోడల్ లో వరుడు ధరించే బెల్ట్‌లు కూడా వెండితో తయారు చేస్తున్నారు. వీటిపై చెప్పులపై ముత్యాలు, రత్నాలు పొదిగి అందంగా డిజైన్ చేస్తున్నారు. చక్కటి లుక్ తో ఆకట్టుకుంటుండటంతో చాలా మంది కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని షాపు యజమాని తెలిపారు. 100 నుంచి 500 గ్రాములు ఉండే ఈ పాదరక్షలను రూ. 25 వేలకు విక్రయిస్తున్నారు. ఏది ఏమైనా షేర్వాణీపై వెండి చెప్పులు ధరిస్తే ఆ రాయల్ లుక్ వేరుగా ఉంటుందంటున్నారు.

Cows on Apartment Balcony : అపార్ట్‌మెంట్ బాల్కనీలో ఆవుల్ని పెంచుతున్న యజమాని .. ఎన్నో ఫ్లోర్‌లోనో తెలుసా..?




											




                                    

ట్రెండింగ్ వార్తలు