Blue sun In UK
Blue sun In UK : బ్రిటన్ లో సూర్యుడు నీలం రంగులో కనిపించి కనువిందు చేశాడు. ఇదేంటీ బ్లూ మూన్..బ్లడ్ మూన్ గురించి విన్నాం చూశాం.. కానీ సూర్యుడు నీలం రంగులోకి మారటమేంటీ అని ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ద గ్రేట్ బ్రిటన్ లోని స్కాట్ లాండ్ లో సూర్యుడు నీలం రంగులో కనిపించటంతో అక్కడి ప్రజలు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ బ్లూ సన్ వైరల్ అవుతున్నాడు. సెప్టెంబర్ 28(2023) యూకేలో సూర్యుడు నీలం రంగులో కనిపించటంతో ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో బ్లూ సన్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాడు.
ఇంతకీ సూర్యుడు నీలం రంగులోకి మారటం వెనుక అమెరికాలో సంభవించిన అగ్నిప్రమాదమేని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అమెరికాలో అగ్ని ప్రమాదం ఏర్పడితే బ్రిటన్ లో సూర్యుడు నీలం రంగులోకి మారడట. ఉత్తర అమెరికాలోని అడవి కార్చిచ్చు పొగ బ్రిటన్‌కు చేరుతోంది. దీంతో వాతావరణంలో మేఘాలు, పొగ కలసిపోవడం కారణంగా సూర్యరశ్మి వివిధ రంగులలో వ్యాప్తి చెందుతోందని తెలిపారు.
Australia : పడవను ఢీకొన్న తిమింగలం…ఒకరి మృతి, మరొకరికి గాయాలు
ప్రతీ రంగు వేరు వేరు వెలుగులను కలిగి ఉంటుంది. నీలి రంగు అధికంగా వ్యాపిస్తుందని అలాగే పర్పుల్ కలర్ తక్కువగా వ్యాపిస్తుందని తెలిపారు. ఇది దాదాపు 380 నానోమీటర్లు ఉంటుందని తెలిపారు. కాగా ఎరుపు రంగు పొడవైన తరంగ ధైర్ఘం కలిగి ఉంటుందని ఇది సుమారు 700 నానో మీటర్లు ఉంటుందని సైంటిస్టులు తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘నీలి రంగు సూర్యుడు’ గురించి రకరకాల కామెంట్లు పెడుతున్నారు యూజర్లు. ఒక యూజర్ ‘స్కాట్లాండ్‌లో అగ్నిపర్వతం నుంచి వెలువడుతున్న బూడిద వల్ల సూర్యుడు కొత్తగా కనిపిస్తున్నాడని అంటే మరొకరు ఉదయం 10:15 గంటలకు ‘బ్లూ సన్’ కనిపించాడని తెలిపారు. ఇంకొకరు ‘ఓహ్ గాడ్..నేను మొదటిసారి నీలి రంగు సూర్యుడ్నిచూస్తున్నాను’ అంటూ సంబరంగా పేర్కొన్నారు. 2017లో పోర్చుగీస్ అడవి కార్చిచ్చుకు సంబంధించిన పొగ బ్రిటన్ అంతటా వ్యాపించింది. అయితే ఈసారి సూర్యుడు నీలి రంగులోకి ఎందుకు మారాడనే దానికి వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.
28th September 2023
Hertfordshire
UKUnnatural fog…#chemtrail #geoengineering pic.twitter.com/P37Mc0SYeA
— Dan Stevens (@Dan__Stevens) September 28, 2023