World Record : మూడు నెలల పసిబిడ్డ ప్రపంచ రికార్డ్ ..!!

పుట్టిన మూడు నెలలు కూడా కాలేదు. ఓ చిట్టితల్లి ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. పుట్టిన 72 రోజుల్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న చంటిబిడ్డ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

theree  Months girl child World Record

theree  Months girl child World Record : పుట్టిన మూడు నెలలు కూడా కాలేదు. ఓ చిట్టితల్లి ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. పుట్టిన 72 రోజుల్లోనే ఏకంగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్న చంటిబిడ్డ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ పసిపాప క్రియేట్ చేసిన రికార్డు ఏంటీ..అంటే..

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వారా జిల్లాకు చెందిన కేసరి నందన్ సూర్యవంశీ,ప్రియాంక దంపతలు, ఇద్దరు పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నారు. వీరికి ఓ బాబు ఉన్నాడు. తరువాత జూలై 8(2023)న పాప పుట్టింది. శరణ్య అని పేరు పెట్టుకున్నారు. తమకు పాప పుట్టిన ఆనందం జీవితాంతం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలనుకున్నారు నందన్ దంపతులు.

దీని కోసం ఓ రికార్డు క్రియేట్ చేద్దామనుకున్నారు. తాము పోస్టల్ డిపార్ట్ మెంట్ లో పనిచేస్తున్నాం పాప పేరుతో సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి రికార్డ్ చేస్తే బాగుటుందని అనుకున్నారు. దీని కోసం ఇంటర్ నెట్ లో సెర్చ్ చేశారు. ఓ చిన్నారి పేరు మీద 28 గుర్తింపు పత్రాలతో ఓ చిన్నారి పేరిట ప్రపంచ రికార్డు ఉందని తెలుసుకున్నారు. ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు శరణ్య పేరుతో 72 రోజుల్లో 31 గుర్తింపు పత్రాలు సంపాదించి లక్ష్యాన్ని సాధించారు. ఈ వార్త కుటుంబ సభ్యులంతా ఆనందపడేలా చేసింది.

Dress with live fish : ఆమె డ్రెస్సే ఒక అక్వేరియం.. బతికున్న చేపలతో క్యాట్ వాక్..

ఆధార్‌కార్డు నుంచి పాస్‌పోర్ట్‌, పోస్టాఫీస్‌, బ్యాంక్‌ ఖాతాలు.. ఇలా పలురకాల పత్రాలు పాప పేరుతో తీసుకున్నారు. శరణ్య తాత గోపాల్‌ కూడా పోస్టల్ ఉద్యోగే. పాప పేరుతో ఆధార్ కార్డ్,పాస్ పోర్టు, ఇమ్యునైజేషన్ కార్డ్,లాడ్లీ లక్ష్మీ, క్యాస్ట్ సర్టిఫికెట్,నేటివిటీ సర్టిఫికెట్, జాతీయ ఆరోగ్య కార్డ్, సుకన్య సమృద్ధి, మహిళా సమ్మాన్న సేవింగ్స్ పత్రం, రాష్ట్రీయ పొదుపు పత్రం,కిసాన్ వికాస్ పత్రం, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా పత్రం, పబ్లిక్ ప్రావిడెంట్,పాన్ ఏటీఎం కార్డ్ ఇలా 31 దృవీపకరణ పత్రాలు పాప శరణ్య పేరుతో ఉన్నాయి.

మనుమరాలు పేరుతో ప్రపంచ రికార్డు గురించి తాత మాట్లాడుతు..గుర్తింపు పత్రాలు లేక చాలామంది ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని ..అటువంటివారికి అవగాహన కల్పించేందుకు తన మనుమరాలి పేరుతో ఇలా చేశామని తెలిపారు.