Site icon 10TV Telugu

Tuna loving Tyler : మరీ అంత ‘నీచు’డా.. ట్యూనా చేప వాసన చూడకుండా ఉండలేడట!

Tyler Tuna Fish Can from USA

Tyler Tuna Fish Can from USA

Tyler Tuna Fish Can from USA : పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అని పెద్దలు ఊరికే అనలేదు. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఒకే తల్లికి పుట్టినవారికి కూడా ఒకేరకమైన ఇష్టాలు ఉండవు. అదే తినే ఆహారం విషయంలో అయితే మరీను.. ఒకరికి వంకాయ కూర ఇష్టమైతే మరొకరికి ఇంకో కూర. అలా ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఇష్టమైన ఫుడ్ కళ్లముందు ఉంటే కాస్త ఎక్కువే తింటాం. ఒకవేళ అది మనకు దొరకకపోతే ఎడ్జెస్ట్ అయి దొరికింది అందుబాటులో ఉన్నదే తింటాం.

కానీ ఓ యువకుడు మాత్రం అలా కాదు. తనకు ఇష్టమైన ట్యూనా ఫిష్ అంటే పడి చచ్చిపోతాడు. అతనికి ట్యూనా ఫిష్ అంటే ఎంత ఇష్టమంటే దాని వాసన చూడందే అతనికి పొద్దుపొడవదు, పొద్దుగూకదు అనేంత ఇష్టం. ట్యూనా ఫిష్ అంటూ పడిచచ్చిపోతాడు. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కనీసం ఒక్కసారైనా ట్యూనా చేప వాసన తగలాల్సిందే. అంత ‘నీచు’డా మరీను అనే ఆ వ్యక్తి ఎవరబ్బా.. అంటే!

అతని పేరు టైలర్. అమెరికాలోని కాన్వాస్‌కు చెందిన వ్యక్తి. ట్యూనా ఫిష్ క్యాన్ అంటే ఓ స్ట్రేంజ్‌ అడిక్ట్ అతనికి‌. ట్యూనా ఫిష్ ఫుడ్‌ లేకుండా మనోడికి రోజు స్టార్ట్‌ అవ్వదంటే అతిశయోక్తికాదు. ఎంతలా అంటే వారానికి ఐదు క్యాన్‌లు లాగించేతంత ఇష్టం. ప్రతి రోజు దాని వాసన చూడకుండా ఉండలేడట. ట్యూనా ఫిష్‌ క్యాన్‌లు ఎప్పుడూ జేబులో ఉండాల్సిందే. పొద్దున్నా లేదు.. మధ్యాహ్నాం లేదు, రాత్రి లేదు. టైమ్ ఏదైనా సమయం ఎంతైనా ట్యూనా చేప వాసన తగలాల్సిందే. ట్యూనా ఫిష్ క్యాన్ లను అలా వాసన చూస్తే ఇలా స్వర్గంలో ఉన్నట్లుంది అంటూ టైలర్. ఉదయం లేవగానే ట్యూనా వాసన పీల్చుకున్నాకే లేస్తాడట.. బెడ్ కాఫీ తాగటానికి ముందు ట్యూనా వాసన చూశాకే కాఫీ టచ్ చేస్తాడట. ట్యూనా లేకపోతే నా జీవితం ఆగిపోతుందేమోనంటాడు టైలర్.. ఓరి నాయనో మరీ ఇంత పిచ్చైతే కష్టమబ్బా అనేలా ఉంది కదూ ఈ ట్యూనా పిచ్చి. వారానికి 15 క్యాన్లు లాగించేస్తాడు ఈ చేపల పిచ్చోడు.

World Tribal Day 2023 : ఆదివాసీల ఆహారంలో ఎర్ర చీమల చట్నీ..

అతనికి ఆ అలవాటు అతని కుటుంబం నుంచే అలవాటైందట. టైలర్‌ అమ్మ ఉర్సులా ఈ విషయాన్ని చెప్పింది. తన కుమారుడికి ట్యూనా అంటే ఎంతటిష్టమో చెబుతు..చిన్నప్పటి నుంచి టైలర్‌కి ట్యూనా ఫిష్‌ అంటే ఇష్టం అని తెలుసు. కానీ మరి ఇంతలా అడిక్ట్‌ అవుతాడని ఊహించలేదని నవ్వుతు చెబుతుంది.

చిన్నతనంలో ఈస్టర్‌కి పిల్లలంతా బుట్టలో చాక్లెట్లు వేసుకుంటే ఇతను మాత్రం ఆ ట్యూనా ఫిష్‌ క్యాన్‌లు బుట్టలో పెట్టుకునేవాడు. వాడికి ఆ ఫిష్‌ అంటే ఇష్టం కదా..అలా పెట్టుకున్నాడని లైట్‌ తీసుకున్నా. కానీ అదే అడిక్ట్ గా మారుతుందని అస్సలు ఊహించలేదని తెలిపింది. టైలర్‌ రోజు ఆ చేప వాసన చూడకుండా ఉండలేడు. అది తినకపోతే ఏం చేయలేను అన్నంత స్టేజ్‌లో ఆ ట్యూనా ఫిష్‌కి అడిక్ట్‌ అయ్యాడని ఒక్కోసారి ఈ విషయం తలచుకుంటేనే తనకు ఆందోళన కలుగుతుందని తెలిపింది. టైలర్ ట్యూనా తినే అలవాటు ఐదు సంవత్సరాల వయస్సప్పటి నుంచి పెరిగింది. అప్పటినుంచి దాదాపు 3,900 డబ్బాలను స్వాహా చేసేశాడు.

IPS Sajjanar : ఒక్క బైక్‌పై ఏడుగురు ప్రయాణం .. ప్రాణాలు పోతాయ్ అంటూ ఐపీఎస్ సజ్జనార్ హెచ్చరిక

ట్యూనా ఫిష్ విశేషాలు..
ట్యూనా చేపను చాలామంది చాలా చాలా ఇష్టంగా తింటారు. సముద్రాలలో పెరిగే ఈ ట్యూనా ఫిష్ పోషకాల గని. ట్యూనా ఫిష్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. బహుశా దీనికి ఇంత డిమాండ్ ఉన్నందువల్లేనేమో ఇవి అంతరించిపోతున్నాయి. అంతరించి పోతున్న చేపల జాతులలో ట్యూనా ఫిష్ ఒకటిగా ఉంది.

ట్యూనా చేపని తెలుగులో తూర చేప అని అంటారు. హిందీలోచురా, మచ్చలి అని, మలయాళంలో చూరా అని, తమిళంలో సూరై అని,మరాఠీలోచురా అని పిలుస్తారు. అంతర్జాతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉన్న ట్యూనా చేప భారత్ లో కొన్ని చోట్ల మాత్రమే లభిస్తుంది. ట్యూనా చేపల్లో 15 రకాల జాతులు ఉన్నాయి. మార్కెట్ లో ఒక్కో రకానికి ఒక్కో ధర ఉంటుంది. మార్కెట్ లో ఒక కేజీ ధర 400 రూపాయల ధర పలుకుతుంది.

Exit mobile version