Bigest onion : ఉల్లిగడ్డ వరల్డ్ రికార్డ్ .. ఒక్క ఉల్లిపాయ 9 కిలోలు

ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డ (9kg onion) ను పండించి సంచలనం సృష్టించాడు బ్రిటన్ కు చెందిన ఓ రైతు.

World Bigest onion

World Bigest onion : కొంతమంది రైతన్నలను..వారి పండించే పంటలను..సాధించే రికార్డులు చూస్తే శాస్త్రవేత్తలు కూడా సరిపోరేమో అనిపిస్తుంది. ఏదో సాధించాలి..ఇంకేదో చేయాలనే ఓ రైతు కృషి ఫలించింది. భారీ ఉల్లిగడ్డలను పండించాలనే ఆ రైతు కల నెరవేరింది. తన కృషికి ఫలితంగా పండిన 9 కిలోల ఉల్లిగడ్డను చూసిన ఆ రైతు ఆనందం అంతా ఇంతా కాదు. ఏకంగా 9 కిలోల బరువున్న ఉల్లిగడ్డ (9kg onion) ను పండించి సంచలనం సృష్టించాడు బ్రిటన్ కు చెందిన ఓ రైతు.

బ్రిటన్ (UK) గ్వెర్న్సే (Guernsey )ప్రాంతానికి చెందిన రైతు గారెత్ గ్రిఫిన్ (Gareth Griffin). కూరగాయలు పండిస్తుంటాడు. 65 గారెత్ కు ఎప్పుడు కొత్త కొత్త పంటలు పడించాలని తపన పడుతుంటారు. అలా భారీ సైజు ఉల్లిపాయను పండించాలనే ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నారు. 12ఏళ్లుగా పట్టువదలని విక్కమార్కుడిలా ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు అతని కృషి ఫలించింది. 8.9 కిలోల బరువున్న ఉల్లిపాయను పండించారు గెరెత్. అతను పండించిన ఉల్లిపాయ ప్రపంచంలోనే అతి పెద్దది అని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ద్వారా ధృవీకరించబడిందని షో నిర్వాహకులు తెలిపారు.

Pink Pigeon : ఆశ్చర్యపరుస్తున్న పింక్ కలర్ పావురం .. ఎక్కడంటే?

హరోగేట్ ఆటమ్ ఫ్లవర్ షో(Harrogate Autumn Flower Show)లో దీన్ని ప్రదర్శించాడు. ఇది ప్రపంచ రికార్డు అని హారోగేట్ ఫ్లవర్ షో ఇన్ స్టా గ్రామ్ లో ప్రకటించింది. ఇది నిజంగా అద్భుతమని, భారీ ఉల్లిగడ్డ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఈ ఉల్లిగడ్డ 8.9 కిలోల బరువు ఉండగా, పొడవు 21 అంగుళాలు. రికార్డును బ్రేక్ చేయడానికి 12 ఏళ్లుగా గ్రిఫిన్ చేస్తున్న ప్రయత్నం ఈ సారి ఫలితాన్నిచ్చింది.

ఈ భారీ ఉల్లిగడ్డ పండించటానికి గారెత్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. అదనపు లైటింగ్, ఆటోమేటిక్ ఇరిగేషన్ వంటి ప్రత్యేక చర్యలతో భారీ ఉల్లిగడ్డను పండించగలిగారు. సాధారణ ఉల్లిపాయల వలెనే ఈ ఈ భారీ సైజు ఉల్లిగడ్డలుకూడా వంట చేసుకోవచ్చని.. కానీ రుచి మాత్రం కొంచెం తక్కువగా ఉంటుందని గ్రిఫిన్ తెలిపారు. సరైన విత్తనాలు, సరైన సాగు విధానాలతోనే ఇలాంటివి సాధ్యమని తెలిపారు.

Ganesh Chaturthi 2023 : రూ.2.5 కోట్లు విలువైన నాణాలతో వినాయకుడికి అలంకరణ

కాగా ఈ భారీ ఉల్లిపాయకు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ధృవీకరించబడిందని షో నిర్వాహకులు తెలిపారు. కానీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌ (Guinness Book of World Records)ను అధికారికంగా ప్రకటించాల్సి ఉందని తెలిపారు ఈ ఘనత సాధించిన రైతు గారెత్ గ్రిఫిన్.