Lucknow Royal Saree : ఈ చీర ధర అక్షరాలా రూ.21.9 లక్షలు..! ప్రత్యేకతలు ఇవే..

ఈ చీర ధర పెడితే ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో ఈ చీర ధర నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఎందుకంటే ఆ చీర ధర అక్షరాలా రూ.21 లక్షలు..ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రూ.21.9 లక్షలు..

Lucknow Royal Saree Rs.21.9 Lakh

Lucknow Royal Saree Rs.21.09 lakh : ఓ చీర ఖరీదు ఎంత ఉంటుంది..? రూ5 వేలు ఉంటుంది. కాస్ట్లీ పట్టుచీరలు అయితే రూ.50వేలు. ఇంకా చెప్పాలంటే ఓ లక్షా రెండు లక్షలు అనుకుందాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే చీర ధర వింటే కళ్లు తేలేయాల్సిందే. ఈ చీర ధర పెడితే ఓ సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు కొనుక్కోవచ్చు. సోషల్ మీడియాలో ఈ చీర ధర నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఎందుకంటే ఆ చీర ధర అక్షరాలా రూ.21 లక్షలు..ఇంకా క్లియర్ గా చెప్పాలంటే రూ.21.9 లక్షలు..(Rs.21.09 lakh )! ఏంటీ ఈ చీరలో ఏమన్నా బంగారు దారాలతో తయారు చేశారా? ఏంటీ మరీ ఇంత రేటా..? అని ఆశ్చర్యపోవచ్చు. మరీ బంగారం కాదుగానీ ఆ చీరలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయట..మరి ఆ ప్రత్యేతకలేంటో చూసేద్దాం..

ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)లోని లఖ్‌నవూ బట్టల షాపులో అమ్మకానికి పెట్టిన ఈ చీర మార్కెట్ ను షేక్ చేస్తోంది. శ్వేతవర్ణంలో అందంగా మెరిసిపోతున్న ఈ చీర షాపులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ చీరకు వినియోగించిన వస్త్రం, తయారీ విధానం, కుట్లు వంటివి ఈ చీరకు ఈ ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. పైగా ఈ చీర తయారీకి రెండేళ్లు పట్టిందట..యూపీలో చికన్ వర్క్ వస్త్రాలకు మంచి డిమాండ్ఉంటుంది. మరి ముఖ్యంగా కాన్పూర్, లక్నోలలో ఈ చికన్ వర్క్ కు ప్రసిద్ది చెందాయి. ఇక్కడ అమ్మే ప్రతీ వస్త్రం దాదాపు చికన్ వర్క్ తో తయారు చేసినవే ఉంటాయి. అక్కడ మహిళలు ఈ చికన్ వర్క్ కుట్టటంలో చేయి తిరగిన వర్కర్లుగా పేరొందారు.

Tomatoes Price : పచ్చని కాపురంలో ‘టమాటా’ చిచ్చు .. ఇల్లు వదిలివెళ్లిపోయిన భార్య

ఈ రాయల్ చీరలో కూడా చికన్ వర్క్ (Chicken work)ను వినియోగించారు. పైగా ఈ చీరకు షిఫాన్‌, చికన్‌కారీ కుట్లు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పారు షాపు నిర్వాహకులు. యూపీ రాజధాని లక్నో(Lucknow)ను ఒకప్పుడు నవాబుల నగరంగా పిలిచేవారు. అదే మాట ఇప్పటికీ కొనసాగుతోంది. అందుకే అత్యంత ఖరీదైన చీరలకు లక్నో సిటీ బాగా ఫేమస్‌. ఈ రూ.21 లక్షల ఖరీదైన ఈరాయల్ శారీ.. హజ్రత్‌గంజ్‌(Hazratganj)లోని అడా ఫ్యాషన్ స్టోర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ చీర ఖరీదు అక్షరాల 21లక్షల 9వేల రూపాయలు.మరి ఇంత ఖరీదైన చీరను కొనటం కూడా గొప్పగానే భావిస్తారు శ్రీమంతులు.

హజ్రత్‌గంజ్‌లోని అడా డిజైనర్ చికాన్ స్టూడియో ఈ చీరను తయారు చేసారు. చికంకారీ ఫ్యాబ్రిక్ మిక్స్‌తో ఈ చీర తయారు చేశారు. అదే దీని ఖరీదు వెనుక ప్రత్యేకత. ఈ చీరలో స్ఫటికాలు ఉపయోగించబడ్డాయి. వాటి వల్లే ఈ చీరకు ప్రత్యేక మెరుపునిచ్చింది. దుబాయ్‌కి చెందిన ఓ మహిళ (Dubai customer) ఈ చీరను కొనుగోలు చేశారు. ఈ మెరుస్తున్న తెల్లటి రంగు చీరను లక్నో రాయల్ చీర (Lucknow Royal Saree)అని పిలుస్తున్నారు. ఈ చీరలో జపాన్ కు చెందిన ముత్యాల(pearls from Japan)ను వినియోగించారు.

Anand Mahindra : ఆ రూమ్‌లో ఉండటానికి ఆనంద్ మహీంద్ర ఎందుకు భయపడుతున్నారు?

షాప్ అడా ఫ్యాషన్ స్టోర్ (Ada Designer Chikan Studio)యజమాని హైదర్ అలీఖాన్ (Haider Ali Khan)ఈ చీర గురించి మాట్లాడుతు..ఇదే కాదు ఇలాంటి ఖరీదైన రాయల్ శారీ మరొకటి ఆర్డర్ వచ్చిందని దాన్ని అక్టోబరు నాటికి తయారు చేస్తామని తెలిపారు. 21లక్షల 9వేల రూపాయలతో ఇంతటి ఖరీదైన చీర కొనుక్కోవడం అవసరమా అని ప్రశ్నిస్తే కొనుగోలు చేసే వాళ్ల అభిరుచిని బట్టి మేం తయారు చేస్తాం అని తెలిపారు. పైగా ఈ చీరను ఒకే వైర్ పై తయారు చేశారని..అందులో అమర్చిన నెట్ కూడా ప్రత్యేకమైనది తెలిపారు. ఇటువంటిదే మరోచీర మా షాపులో ఉందని దాని ఖరీదు రూ.10లక్షలు అని తెలిపారు. దాదాపు అంతే ధరతో మరో చీర కోసం ఆర్డర్ వచ్చింది ఆ చీరను తయారీలో ఉందని తెలిపారు.

ఈ చీర బోర్డరే రెండు లక్షలు ఖరీదు ఉంటుందన్నారు. దీనిని సన్యాసినులు తమ చేతులతో స్వయంగా తయారు చేశారని 32 రకాల చికన్ వర్కులు ఈ చీరలో ఉన్నాయని తెలిపారు. ఈ చీర ఇంత ఖరీదు కావటానికి అదో పెద్ద కారణమని తెలిపారు.