cobra snake wrapped around woman leg
Cobra wrapped Around woman leg : నాగుపాము కనిపిస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. నోటమ్మట మాటే రాదు. అటువంటిది ఓ మహిళకు నాగుపాము కాళ్లకు చుట్టేసుకుంది. పడగ విప్పి బుసలు కొడుతోంది. ఆమె కాలు కదిపితే కాటు తప్పదనేలా ఉంది పరిస్థితి. కానీ ఆమె మాత్రం కాళ్లకు పాము చుట్టుకుంటే ఏం చేసిందో తెలిస్తే మాత్రం ఆ పామేదో మన కాళ్లకే చుట్టుకున్నంత హడలిపోతాం. భయంకరమైన విషసర్పం కాళ్లకు చుట్టుకుంటే ఆ మహిళ మాత్రం ‘ఓం నమశ్శివాయ’అంటూ శివనామ స్మరణ చేస్తు నిలబడిపోయింది. అలా ఏదో ఓ నిమిషమో అరగంటో కాదు అరగంట అంటే కూడా చాలా ఎక్కువే.కానీ ఆమె మాత్రం కాళ్లకు నాగుపాము చుట్టుకుంటే శివనామ స్మరణ చేస్తు మూడు గంటలు అలాగే నిలబడి ఉంది. వింటుంటేనే వెన్నులోంచి వణుకు పుట్టించే ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది.
శ్రావణ సోమవారం రోజున (ఆగస్టు 28,2023) ఉత్తర్ ప్రదేశ్‌లోని సంగం సదర్ తహసీల్‌లోని దహ్రా గ్రామంలో ఓ మహిళ కాలికి నాగుపాము చుట్టుకుని మూడు గంటలు అలాగే ఉండిపోయింది. ఆమె మాత్రం అటుఇటు కదలకుండా చేతులెత్తి దణ్ణం పెట్టుకుని శివ నామాన్ని జపిస్తూనే ఉంది. ఇది కాస్తా ఆ ప్రాంతం మొత్తం తెలిసిపోయింది. హమీర్‌పూర్ జిల్లా దేవిగంజ్ గ్రామంలో నివసించే మిథిలేష్ కుమారి యాదవ్ అనే మహిళ రాఖీ పండగ తన సోదరుడికి రాఖీ కట్టటానికి తల్లి ఇంటికి వచ్చింది. ఆ రోజు రాత్రి ఆమె నిద్రపోతున్న సమయంలో పాము ఆ మహిళ కాలికి చుట్టుకుంది. తన కాలికి చుట్టుకున్న విషసర్పాన్ని చూడగానే మిథిలేష్‌కి శివుడు గుర్తుకొచ్చాడు. ఆమె పాముని చూస్తూనే శివ ధ్యానం చేస్తు ఉండిపోయింది.
Australia : మహిళ మెదడులో 3 అంగుళాల పారాసైట్.. అరుదైన కేసుగా చెబుతున్న న్యూరో సర్జన్లు
ఈ సంఘటనకు చెందిన వీడియో కూడా బయటపడింది. దీనిలో మహిళ తన గదిలోని మంచం మీద మంచం మీద కూర్చుని ఉంది. అలా కూర్చున్న ఆమె కాలికి పాము చుట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పాము పడగ విప్పి కనిపిస్తోంది. ఆమె మాత్రం చేతులు జోడించి శివ నామ స్మరణ చేస్తోంది. ఈ దృశ్యాన్ని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. సమాచారాన్ని ఇచ్చారు. పోలీసులు పాములు పట్టేవాడిని పిలిపించి పామును ఆ మహిళకు ఎటువంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా కాలి నుంచి బయటకు తీశారు.
Uttar Pradesh: पैर पर तीन घंटे तक फन फैलाए लिपटा रहा कोबरा सांप, महिला करती रही भगवान शिव की आराधना#UPNews #viralvideo #UttarPradesh #Cobra #HarHarMahadev #श्रावण_मास #सावन pic.twitter.com/Mg17aYqQHW
— Shailendra Singh (@Shailendra97S) August 28, 2023
ఈ ఘటన గురించి మిధిలేష్ కుమారి మాట్లాడుతు..తన కాలికి చుట్టుకున్న పాముని చూసి చాలా భయం వేసిందని కానీ ఏం చేయగలను..? ధైర్యం తెచ్చుకున్నాను. శివయ్య నాగుల్ని ఆభరణంగా ధరించినవాడు. శివయ్యను వేడుకుంటే పాము తనను కాటు వేయదు అనే నమ్మకంతో శివధ్యానం చేస్తు కూర్చున్నానని తెలిపింది. తనకు దేవుడిపై ఉన్న నమ్మకమే తనను బతికించిందని పాము బారి నుంచి కాపాడిందని తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. మరోపక్క మూడు గంటల పాటు విషసర్పం కాలికి చుట్టుకున్నా ఆమె ధైర్యం గొప్పదని పాము కూడా ఆమెకు ఎటువంటి హాని చేయకపోవటం ఆ శివయ్య మహత్యమేనంటున్నారు స్థానికులు.