Uttar Pradesh : ఒట్టి చేతులతో అండర్‌గ్రౌండ్‌లో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించిన వ్యక్తి ..

ఎవరి సహాయం లేకుండా కనీసం యంత్రాల సహాయం లేకుండా ఓ వ్యక్తి. రెండు అంతస్థుల భవనం నిర్మించాడు. అది కూడా అండర్ గ్రౌండ్ లో.

Man Builds Two Storey Underground Palace

UP Man Builds Two Storey Underground Palace : మనిషి తలచుకుంటే కొండల్ని పిండి కొట్టేయగలడు. తన అవసరాలకు, అభిరుచులకు తగినట్లుగా సమాజాన్ని మార్చిన మనిషి ఎన్నో ఘనతలు సాధించాడు. తన మేథస్సుతోవిశ్వ రహస్యాలను ఛేధిస్తున్నాడు. కొండల్ని పిండి చేయటమే కాదు కోటలు కట్టేయగలడు. కానీ ఓ మనిషికి అది సాధ్యమవుతుందా..? ఒకే ఒక్క వ్యక్తికి అది సాధ్యమవుతుందా..? ఎవరి సహాయం లేకుండా కనీసం యంత్రాల సహాయం లేకుండా కోట కట్టేయగలడా…? అంటే ఎందుకు కట్టలేడు అని నిరూపించాడు ఓ వ్యక్తి. అదికూడా భూగృహంలో. ఒకే ఒక్క పార సహాయంతో రెండు అంతస్థుల ప్యాలెస్ నిర్మించేశాడు.

ఈ అద్భుతాన్ని సృష్టించిన వ్యక్తి పేరు ఇర్ఫాన్. కానీ అందరు అతన్ని పప్పు బాబా అంటారు. ఉత్తరప్రదేశ్ లోని హర్ధోయ్ లోని ఇర్ఫాన్ రెండు అంతస్తుల ప్యాలెస్ నిర్మించాడు. ఈ నిర్మాణానికి కేవలం ఒకే ఒక్క పారను ఉపయోగించాడు. ఈ రెండు అంతస్థుల ప్యాలెస్ నిర్మించటానికి పప్పు బాబాకు 12 ఏళ్లు పట్టింది. 2011లో ప్యాలెస్ నిర్మాణం ప్రారంభించాడు. ఈ రెండు అంతస్తుల ప్యాలెస్ లో 11 గదులు, ఒక మసీదు, ఒక గ్యాలరీ, ఒక డ్రాయింగ్ రూమ్ వంటివి నిర్మించాడు. పక్కా వాస్తుతో వీటిని నిర్మించాడు పప్పు బాబా. అంతే కాదు ఈ ప్యాలెస్ నిర్మాణంలో ఓ బావిని కూడా నిర్మించాడు. ప్రజలు ఈ బావి నీటిని తాగటానికి ఉపయోగపడేలా చేశాడు. కానీ కొంతమంది ఆ బావిని పాడు చేశారని విచారం వ్యక్తంచేస్తున్నాడు పప్పు బాబా.

Ghoda Library : పర్వతాలు, మారుమూల గ్రామాల పిల్లల కోసం ‘గుర్రం లైబ్రరి’ ..

2011లో ఈ భవనాన్ని ఓ పార సహాయంతో నిర్మించటం ప్రారంభించాడు. అలా 12 ఏళ్లకు పూర్తి అయ్యింది. ఎన్నో అడ్డంకుల్ని ఎదుక్కొంటు నిరంతరం ఈ భవనం నిర్మాణంలో మునిగిపోయేవాడు పప్పు బాబా. కుటుంబానికి కూడా దూరంగా ఉండి దీన్ని పూర్తి చేశాడు. ఈ నిర్మాణం చూడటానికి ఎంతోమంది వస్తుంటారు.

ప్యాలెస్ గోడలపై పురాతన కాలం నాటి నగిషీలను కూడా చెక్కాడు. అలా 12 ఏళ్లుగా ఈ భవనానికి మెరుగులు దిద్దుతునే ఉంటున్నాడు. ఓ ఐడియా వస్తే ఆ భవనానికి మరికొన్ని మెరుగులు దిద్దుతుంటాడు. తన 12 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా ఏర్పడిన ఆ భవనాన్ని చూసి మురిసిపోతుంటాడు పప్పు బాబా. ఏది ఏమైనా ఒకే ఒక్క వ్యక్తి తన అనుకున్నదాన్ని పూర్తి చేయటమే కాదు రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించటం నిజంగా అద్భుతమనే చెప్పాలి.

కాగా..పప్పు బాబా తమ కుటుంబం జీవనాధారంగా భావించే వ్యవసాయ భూమిలోని మట్టితో ఈ ఇంటిని నిర్మించాడు. పైకి బంకర్‌లా కనిపించే ఈ రెండు అంతస్తుల భవనం ఎంతోమందిని ఆకర్షిస్తోంది. ఇర్పాన్ తండ్రి 2010లో చనిపోయారు. అప్పటి నుంచే ఇర్ఫాన్‌‏కు కష్టాలు మొదలయ్యాయి. కుటుంబాన్ని పోషించుకోవటానికి ఉపాధి నిమిత్తం ఢిల్లీ వెళ్లాడు. కొన్నాళ్లు అక్కడే పనిచేశాడు. కానీ అక్కడ ఉండబుద్దికాలేదు. తన గ్రామానికి తిరిగివచ్చేశాడు. ఆ తరువాత స్థానికంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేశాడు. కానీ ఓడిపోయాడు. ఓటమితో నిరాశపడిపోయాడు. మరోసారి గ్రామం వదిలి వెళ్లిపోయి కొంతకాలానికి తిరిగి వచ్చాడు. తనకంటు సొంతగా ఇల్లు ఉండాలని అనుకున్నాడు.

అలా 2011లో భూగర్భంలో ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టాడు. చిన్న పార లాంటి పరికరం సాయంతో ఒక్కడే కష్టపడి పాతకాలంలో ఉండేలా నిర్మించాడు. అలా ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించిన అతను కేవలం భోజనం చేసేందుకు మాత్రమే ఇంటికి వెళ్లేవాడు. అలా ఒక్కడే మట్టితో ఇల్లు కడుతున్న అతడిని చాలామంది ఎగతాళి చేసేవారు. కానీ అతను పట్టించుకోలేదు. అలా 12 ఏళ్లు కష్టపడి ఓ మసీదు, డ్రాయింగ్‌ రూం, డైనింగ్ రూమ్, హాల్ ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా గదులతో చక్కగా ఇల్లు నిర్మించాడు. పూర్తి అయిన ఆ ఇంటిని చూసి స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామస్థులు ఇంటిని ఇర్ఫాన్‏ను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఒకప్పుడు గేలి చేసినవారే శెభాష్ అని మెచ్చుకుంటున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు