ప్రస్తుత యుగం సోషల్ మీడియాదే. వింతైన విషయాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్ అయ్యే వీడియోలు కొందరికి ఇబ్బందిగానూ, మరికొందరికి వరంగానూ ఉండవచ్చు.
సోషల్ మీడియా వల్ల రాత్రికి రాత్రి స్టార్లు అయినవారూ ఉన్నారు. ఇబ్బందులు ఎదుర్కొన్నవారూ ఉన్నారు. తాజాగా ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. పెళ్లిలో వధువుకి వరుడు ముద్దుపెట్టాలని అనుకుంటాడు. వద్దొద్దనేలా పెళ్లి కూతురు దూరం జరుగుతుంది. ముద్దు పెట్టే క్రమంలో రెండు సార్లు విఫలమై మూడోసారి విజయం సాధిస్తాడు పెళ్లికొడుకు.
సాధారణంగా వివాహంలో చాలా మంది వధూవరులు అందరి దృష్టిని ఆకర్షించే పనులు చేస్తారు. ఈ పెళ్లిలో మరింత వింతగా ఈ వధూవరులు చేసిన పని చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు. అందరి ముందూ వరుడు ముద్దు పెడుతుండడంతో వధువు నిరాకరించినప్పటికీ.. పెళ్లికొడుకు సక్సెస్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపర్చుతోంది.