CM Mamata Banerjee Dance : సల్మాన్ ఖాన్‌తో కలిసి మమతా బెనర్జీ స్టెప్పులు .. దీదీ డ్యాన్స్‌కు ప్రముఖులు ఫిదా

ఎప్పుడు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే పశ్చిమ బెంగా సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూశారా..? బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్ లతో కలిసి దీదీ వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.

CM Mamata Banerjee Dance

west bengal CM Mamata Banerjee Dance : ఎప్పుడు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే పశ్చిమ బెంగా సీఎం మమతా బెనర్జీ డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుందో చూశారా..? బెంగాల్ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా ఫైర్ బ్రాండ్ గా పేరొందిన దీదీ నోరు విప్పితే మాటల తూటాలు దూసుకొస్తాయి.అటువంటి దీదీ సినిమా ప్రముఖులతో కలిసి డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. దీదీ 68 ఏళ్ల వయస్సులో కూడా మాంచి హుషారుగా ఉంటారు. ఫిట్ గా ఉంటారు.

అటువంటి దీదీ కోల్ కతా ఇంజర్నేషనల్ ఫెస్టివల్ లో బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అనిల్ కమపూర్ తో పాటు పలువురు ప్రముఖులతో కలిసి స్టేజీపై డ్యాన్స్ వేశారు. దీదీని స్టెప్పులు వేయాలని సల్మాన్ ఖాన్ రిక్వెస్ట్ చేయగా ఆమె స్టేజీపై తనదైన శైలిలో స్టెప్పులు వేసి అలరించారు.

సల్మాన్ ఖాన్ కోల్‌కతాలోని సిటీ ఆఫ్ జాయ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్‌,మమతా బెనర్జీ, టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వంటి పలువురు ప్రముఖులు కూడా ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దీదీ సినీ ప్రముఖులతో కలిసి డాన్స్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. మమతా బెనర్జీ సల్మాన్ ఖాన్ సహా ఇతరులతో ఒకే వేదికపై చేరడం సినీ అభిమానులను మరింత ఉత్సాహపరిచింది. సింగర్ అరిజిత్ సింగ్ పాడిన పాటకు మమతా బెనర్జీ కాలుకదిపి ఫిలిం ఫెస్టివల్‌లో మరింత జోష్ నింపారు.