Viral Video : వాటే బ్యాలెన్స్..! నెత్తిమీద గ్యాస్ సిలిండర్ పెట్టుకుని బిందె మీద మహిళ డ్యాన్స్

ఈ మహిళ బ్యాలెన్స్ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతునున్నారు. ఆమె అలా డ్యాన్స్ చేస్తుంటే వీడియో చూసేవాళ్లకే ఎక్కడి పడిపోతుందో అనిస్తుంది. కానీ ఆమె మాత్రం ఏదో ప్రాక్టీస్ ఉన్నట్లుగానే అలవోకగా చేసేసింది.

woman dancing with gas cylinder

woman dancing with gas cylinder  : భరతనాట్యం చేసేవారు  కలశం మీదనో..పళ్లెం మీదను చక్కగా డ్యాన్స చేస్తారు. అలా చేయటానికి సాధన కావాలి. లేదంటే బ్యాలెన్స్ తప్పిపడిపోతారు. కానీ ఓ మహిళ చేసే బ్యాలెన్స్ డ్యాన్స్ చూస్తే వావ్ అనిపిస్తుంది. వాటే బ్యాలెన్స్ అనిపిస్తుంది. ఓ అమ్మాయి నెత్తిమీద వంట గ్యాస్ సిలిండర్ పెట్టుకుని ఓ బిందెమీద నిలబడి డ్యాన్స్ చేసింది. గ్యాస్ సిలిండర్ ను నెత్తిమీద నిలబెట్టుకుని బిందెమీదకు అవలీలగా ఎక్కేసి అక్కడ కూడా డ్యాన్స్ చేసింది. బొంగరంలా గిరగిరా తిరిగేసి ఓ భంగిమతో ఎండ్ చేసింది.

ఈ మహిళ బ్యాలెన్స్ డ్యాన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతునున్నారు. ఆమె అలా డ్యాన్స్ చేస్తుంటే వీడియో చూసేవాళ్లకే ఎక్కడి పడిపోతుందో అనిస్తుంది. కానీ ఆమె మాత్రం ఏదో ప్రాక్టీస్ ఉన్నట్లుగానే అలవోకగా చేసేసింది. దీనికి సంబంధించిన వీడయో ఇన్ స్టాగ్రామమ్ లో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారంత రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోకు లక్షా 83వేల లైక్స్ వచ్చాయి. మరి మీరు కూడా ఓ లుక్కేయండీ ఈ బ్రేవ్ బ్యాలెన్స్ డ్యాన్స్ పై..