ChatGPT Made Beer : AI తయారు చేసిన బీర్ .. 150వ వార్షికోత్సవం సందర్భంగా కంపెనీ వినూత్న యత్నం

బీర్ తయారు చేయడానికి ఏఐను ఉపయోగించారు. ఓ కంపెనీ ఫ్యూచర్ డ్రింక్‌ను తయారు చేసేందుకు ఏఐను వినియోగించింది.

beers designed Ai

Ai  designed beers: చాట్‌జీపీటీ. టెక్నాలజీ డెవలప్ మెంట్ లో ఇటీవల బాగా వినిపిస్తోంది. కృత్రిమ మేధ (AI) ఆధారంగా ఓపెన్‌ ఏఐ సంస్థ రూపొందించిన చాట్‌జీపీటీ (ChatGPT) ఇప్పటికే బాగా పాపులర్‌ అయిన సంగతి తెలిసిందే. చాట్‌జీపీటీ సేవలు అందుబాటులోకి వచ్చాక వింత వింత పోకడలు వైరల్ అవుతున్నాయి. ఏఐ రూపొందించిన ఫోటోలు కోకొల్లలుగా వైరల్ అవుతున్నాయి. అలా మాయ చేస్తోందీ చాట్ జీపీటీ. దీని వినియోగం ఓ ట్రెండ్ గా మారిపోయింది. దీంట్లో భాగంగా బ్రూవర్స్ దీన్ని బీర్ తయారు చేయడానికి ఉపయోగించారు. జర్మన్‌కు చెందిన బెక్ కంపెనీ ‘బెక్స్ అటానమస్’ అని పిలువబడే ఫ్యూచర్ డ్రింక్‌ను తయారు చేసేందుకు వినియోగించింది.

1873లో జర్మనీలోని బ్రెమెన్‌లో ‘బెక్స్ అటానమస్’ కంపెనీ స్థాపించబడినప్పటి నుంచి ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. ఈ కంపెనీ 150వ వార్షికోత్సవ వేడుకలు జరుపుకోబోతోంది. ఈ క్రమంలో వినూత్నంగా ఏదైనా చేయాలనుకుంది. కస్టమర్లను సరికొత్తగా ఆకట్టుకోవాలని అనుకుంది. దీంతో సదరు కంపెనీ ప్రతినిధులు చాట్‌జీపీటీ మేడ్ బీర్‌ ఐడియాతో కస్టమర్స్‌ను మరింత అట్రాక్ట్ చేయాలని నిర్ణయించారు. అనుకోవటమే తరువాయి దాన్ని అమల్లో పెట్టేశారు. దీనికి సంబంధించి రెసిపీ, ప్యాకేజింగ్, నేమింగ్, అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్స్, ప్యాకేజింగ్‌తో పాటు వెబ్‌సైట్ డిజైన్‌ కూడా ఏఐ రూపొందించడం విశేషం. ఇక 150 యూనిట్ల లిమిటెడ్ బీర్ ఇప్పటికే టేస్టర్లకు ఉచితంగా డెలివరీ చేయబడింది.

Strange Creature : ఇసుకలో వేగంగా ఈదే వింత జీవి .. భూమిలోనే జీవితం

పబ్లిక్ కు మరింత హ్యాపీ కలిగించేందుకు దీన్ని మరింతగా విడుదల చేయాలా వద్దా అని యోచిస్తోంది. దీని కోసం అభిప్రాయానలను సేకరిస్తు అధ్యయనం చేస్తోంది కంపెనీ. ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ బీర్.. ప్రత్యేక టేప్‌తో ప్యాక్ చేయబడి..ఫ్యూచర్ లేబుల్‌తో డెకరేట్ చేయబడిన ఫ్యాన్సీ బాక్స్‌లో టేస్టర్స్ దగ్గరకు చేరింది. ‘ఈ బీర్ దానంతటదే తయారు చేయబడింది(The beer that brewed itself)’ అని కూడా చాట్‌జీపీటీ దీనిపై ట్యాగ్‌లైన్ రాసుకొచ్చింది.