Most Expensive Tomato : టమాటాలా మజాకా.. కిలో రూ.3 కోట్లు, బంగారం కంటే బాబులాంటి ధర!

కిలో టమాటాలు సెకండ్ సెంచరీకి దగ్గర్లో ఉంటేనే వామ్మో.. వాయ్యో అంటూ అల్లాడిపోతున్నాం..కానీ ఓ రకం టమాటా ధర తెలిస్తే నోరెళ్లబెట్టటం కాదు ఈ టమాటాలు కొనేకంటే కిలోల లెక్కన బంగారం కొనుక్కోవచ్చు కదానిపిస్తుంది...

World most expensive tomato Hejera Genetics Tomato Seed

World Most Expensive Tomato : టమాటా.. టమాటా.. టామాటా ఎక్కడ విన్నా ఇదే మాట. దీనికి కారణమేంటో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కిలో టమాటా ధర రూ.160 నుంచి రూ.250 వరకు అమ్ముతోంది. ఈ ధర రూ.300లకు కూడా చేరొచ్చంటున్నారు వ్యాపారులు. టమాటాలతో పాటు మిగిలిన కూరగాయల ధరలు కూడా పోటీ పడుతున్నాయి. కిలో అల్లం ఏకంగా రూ.450 అమ్ముతోంది. ఇక ఉల్లిపాయలు కూడా కిలో రూ.70కి చేరతాయని వ్యాపారులు చెబుతున్నారు.

మరి కిలో టమాటాలు డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉంటేనే వామ్మో.. వాయ్యో అంటూ గుండెలు బాదేసుకుంటున్నాం. కానీ కిలో టమాటాలు రూ.2,500లు అంటే ఇంకెంత హడలిపోతామో కదా.. ఇక కిలో టమాటా విత్తనాల ధర ఏకంగా రూ. కోట్లల్లో పలుకుతోంది అంటే ఇక గుండె వేగం పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకుంటునే హార్ట్ ఎటాక్ వచ్చే పరిస్థితి.

రెండు నెలల నుంచి టమాటల ధరలు పైపైకి పోతున్నాయి. సామాన్యులకే కాదు ఓ మాదిరి శ్రీమంతులు కూడా కొనలేక ఎక్కడ ఫ్రీ అంటే అక్కడికి.. ఎక్కడ తక్కువ ధరకు వస్తున్నాయని సమాచారం అందితే అక్కడికి ఉరుకులు, పరుగులతో వెళ్లి క్యూల్లో ఉండి మరీ కొంటున్నారు. ఇలా టమాటల గురించి దేశంలో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టమాటాల చోరీలు, టమాటా వాహనాలు దోపిడీలు, టమాటా తోటలకు కాపలాలు.. ఇలా చెప్పుకుంటు పోతే ఎన్నో వింతలు.. మరెన్నో విచిత్రాలకు వినిపిస్తు.. కనిపిస్తు ఇది టమాటల కాలంరా బాబూ అనేలా చేస్తున్నాయి.

READ ALSO : Cattle Nutrition : అధిక పాల దిగుబడి కోసం నాణ్యమైన పోషణ

ఇదిలా ఉంటే హజేరా జెనెటిక్స్‌ (Hejera Genetics) అనే యూరోపియన్‌ విత్తనాల కంపెనీ సమ్మర్‌ సన్‌ (Summer Sun) రకానికి చెందిన టామాటా విత్తనాలను కిలో 3.50 లక్షల డాలర్లకు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.3 కోట్లు అమ్ముతున్న ఘటన విస్తుపోయేలా చేస్తోంది. ఈ విత్తనాలతో పండే టమాటాల ధర యూరోప్‌ మార్కెట్‌ (European marke)లో కిలో దాదాపు 30 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.2,500 వరకు ఉంటుంది. ఈ లెక్కన మన టమాటాలు చౌకగా దొరుకుతున్నట్లే కదా. ఈ రకం ఒక్కో విత్తనానికి సగటున 20 కిలోల వరకు దిగుబడినిస్తుందట.

ఈ టమాటా విత్తనాలు రూ.3 కోట్లు అంటే ఐదు కిలోల బంగారం ఈజీగా కొనేసుకోవచ్చు కదూ అనిపిస్తోంది. కాగా ఈ టమాటా విత్తనాలు ఇంత ఖరీదుకు కారణం అధిక దిగుబటి ఇవ్వటమే కారణమంటున్నారు. అంతేకాదు ఈ ప్రతీ పంటకు రైతులు కొత్త విత్తనాలు కొనుగోలు చేయవల ఉంటుందట. ఇంత ధర ఉన్నా ఈ టమాటాల రుచి అమోఘంగా ఉంటుందట. కాబట్టి విత్తనాలు అంత భారీ ధరకు కొనుగోలు చేసినా దానికి తగినట్లే పంట దిగుబడి కూడా రావటంతో రైతులు ఈ విత్తనాలనే కొంటుంటారట. పైగా టమాటాల రుచి కూడా అమోఘంగా ఉండటంతో ఈ పంటకు మంచి డిమాండ్ ఉందట.

READ ALSO : మిరప నార్లు పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారుకోసం పాటించాల్సిన యాజమాన్యం

ఈ టమాటా విత్తనాల ఉత్పత్తి, ప్రాసెసింగ్ కూడా భారీగా ఉంటుందట. అత్యంత జాగ్రత్తగా వీటిని తయారు రూపొందించాలట. క్వాలిటీలో ఎటువంటి అజాగ్రత్త వహించకూడదని హెజెరా పరిశోధకులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు