Worlds Oldest Dog : ప్రపంచంలోనే వృద్ధ కుక్క మృతి, జీవితమంతా ఒకే కుటుంబంతో అనుబంధం

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ‘బోబీ’ అనే కుక్క కన్నుమూసింది.

Worlds Oldest Dog : ప్రపంచంలోనే వృద్ధ కుక్క మృతి, జీవితమంతా ఒకే కుటుంబంతో అనుబంధం

Worlds Oldest Dog Ever Bobi lfe ened

Updated On : October 24, 2023 / 10:27 AM IST

Worlds Oldest Dog Ever Bobi lfe ened : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ శునకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన ‘బోబీ’ అనే కుక్క కన్నుమూసింది. ఒక కుక్కను పెంచుకుంటే దానిపై ఎనలేని ప్రేమ ఏర్పడుతుంది. అటువంటిది ఆ కుక్క చనిపోతే సొంత కుటుంబ సభ్యులే చనిపోయినంతగా బాధపడిపోతాం. అటువంటి ఓ కుక్క తన జీవితాంతం ఒకే కుటుంబంతో గడిపి చనిపోతే ఆ కుటుంబానికి ఎం బాధ ఉంటుందో కదా..అదే బాధను అనుభవిస్తున్నారు బోబీని పెంచుకున్న కుటుంబం.

గత ఫిబ్రవరి నెలలోనే బోబీ అత్యంత వృద్ధ కుక్కగా గిన్నిస్ రికార్డు పొందింది. 11 మే 1992న జన్మించిన బోబీ అనే కుక్క తన 31 సంవత్సరాల 165 రోజుల వయసులో మరణించింది. బోబీని పోర్చుగల్‌ కు చెందిన ఓ కుటుంబం బోబీని ఎంతో ప్రేమగా సాకింది. అలా బోబీ తన జీవితంతా లియోనెల్ కోస్టా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి జీవించింది. దీంతో బోబీ మరణంతో ఆ కుటుంబం ఎంతగానో తల్లడిల్లిపోతోంది. రఫీరో డో అలెంటెజో‌ బ్రీడ్‌కు చెందిన బోడీ శనివారం (అక్టోబర్ 21,2023) కన్నుమూసింది.

Viral Video : కొడుకుని పైలట్ చేయడం కోసం అతని తల్లి 30 ఏళ్లు హౌస్‌కీపర్‌గా పనిచేసింది.. చివరికి..

బోబీని ఎన్నోసార్లు పరీక్షించిన డాక్టర్ కరెన్ బెకర్ ఫేస్ బుక్ లో ఈ విషయాన్ని వెల్లడిస్తు..‘‘ఈ స్వీట్ బాయ్ శనివారం రాత్రి నింగికి ఎగిశాడు’’ అంటూ పేర్కొన్నారు. భూమిపై ఎన్నో శునకాల కంటే ఎక్కువ కాలం జీవించినా బోబీ మరణం చాలా బాధకలిగిస్తోందన్నారు. బోబీని ఎంతగానో ఇష్టపడేవారికి 11,478 రోజులు సరిపోవు అంటూ డాక్టర్ కరెన్ ఎమోషనల్‌గా రాసుకొచ్చారు.

బోబీ కంటే ముందు 1939లో ఆస్ట్రేలియాకు చెందిన బ్లాయ్ అనే కుక్క 29 సంవత్సరాల 5 నెలలు వయసులో మరణించింది. అప్పటివరకు అదే అతిపెద్ద వయసున్న శునకంగా గుర్తింపు పొందింది. ఆ రికార్డును బోబీ బద్దలు కొట్టింది. అంతేకాదు గత ఫిబ్రవరిలో బోబీ ప్రపంచంలోనే అత్యంత వద్ధ శునకంగా రికార్డు క్రియేట్ చేసింది. రికార్డు సాధించిన సంవత్సరమే మరణించింది.