Best Samsung Phones : శాంసంగ్ లవర్స్ కోసం రూ. 10వేల లోపు ధరలో టాప్ 3 శాంసంగ్ ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!
Best Samsung Phones : శాంసంగ్ ఫోన్ కొంటున్నారా? అద్భుతమైన ఫీచర్లతో ఈ నెలలో రూ. 10వేల లోపు ధరలో బెస్ట్ శాంసంగ్ ఫోన్లను కొనేసుకోవచ్చు.

Best Samsung Phones
Best Samsung Phones : కొత్త శాంసంగ్ ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే, మీకోసం 2025లో అద్భుతమైన ఫీచర్లతో అనేక శాంసంగ్ ఫోన్లు (Best Samsung Phones) అందుబాటులో ఉన్నాయి. మీరు రూ. 10 వేల బడ్జెట్ లోపు శాంసంగ్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకోసమే. ఈ ఫోన్‌లు బిగ్ డిస్‌ప్లే, మంచి కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో భారీ బ్యాటరీని అందిస్తున్నాయి.
ఈ ఫోన్‌లో హై గ్రాఫిక్స్‌తో గేమ్స్ కూడా ఆడవచ్చు. ఎలాంటి లాగ్ సమస్య లేకుండా ఈ శాంసంగ్ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరకు కొనుగోలు చేయొచ్చు. మీ దగ్గర ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే.. ఈ స్మార్ట్‌ఫోన్‌లపై అదనంగా 5శాతం క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఆగస్టు 2025లో రూ. 10వేల లోపు టాప్ 3 బెస్ట్ శాంసంగ్ ఫోన్లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోండి.
1. శాంసంగ్ గెలాక్సీ M06 5G :
శాంసంగ్ గెలాక్సీ M06 5G ఫోన్ 6.74 అంగుళాల PLS LCD స్క్రీన్‌తో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. సున్నితమైన విజువల్స్‌ను అందిస్తుంది. 50MP+2MP డ్యూయల్ కెమెరా సెటప్ పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా పొందవచ్చు. బ్యాక్ కెమెరా క్లియర్ ఫొటోలను క్యాప్చర్ చేస్తుంది.
ఈ శాంసంగ్ ఫోన్ 5000mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది. త్వరగా ఛార్జ్ చేసేందుకు 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కూడా పొందవచ్చు. మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఎలాంటి లాగ్ సమస్య లేకుండా రోజువారీ పనులకు బెస్ట్. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ గెలాక్సీ M06 5G ఫోన్ ధర రూ. 9,199గా ఉంటుంది.
2. శాంసంగ్ గెలాక్సీ F06 5G :
శాంసంగ్ గెలాక్సీ F06 5G ఫోన్ 6.7 అంగుళాల HD ప్లస్ PLS LCD డిస్ ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ పొందుతారు. బ్యాక్ సైడ్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ ఫోన్ 5000mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది. సాధారణ వినియోగంపై 1-2 రోజులు సులభంగా ఉంటుంది. ఈ శాంసంగ్ ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసేందుకు 25 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమన్షిటీ 6300 ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో సులభంగా మల్టీ టాస్క్ చేయవచ్చు. 4GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ. 9,783 ఉంటుంది.
3. శాంసంగ్ గెలాక్సీ M13 5G :
శాంసంగ్ గెలాక్సీ M13 5G ఫోన్ 6.5 అంగుళాల LCD డిస్ ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో బ్యాక్ సైడ్ 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరాను పొందవచ్చు. ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరాను పొందుతారు. 5000mAh లాంగ్ బ్యాటరీతో వస్తుంది,.
ఈ ఫోన్ లోపల మీడియాటెక్ డైమన్షిటీ 700 ప్రాసెసర్ పొందుతారు. అయితే, ధర రూ. 10 వేల కన్నా కొంచెం ఎక్కువగా ఉంటుంది. కానీ, పండుగ సీజన్ అమ్మకాలలో మీరు ఈ శాంసంగ్ గెలాక్సీ M13 ఫోన్‌ను కేవలం రూ. 9,890కు పొందవచ్చు.