Best Phones : కొత్త ఫోన్ కావాలా? రూ. 20వేల లోపు ధరలో బిగ్ డిస్‌‌ప్లేతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Best Phones : అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన ఫోన్ల కోసం చూస్తున్నారా? ప్రస్తుతం రూ. 20వేల లోపు ధరలో టాప్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి..

Best Phones : కొత్త ఫోన్ కావాలా? రూ. 20వేల లోపు ధరలో బిగ్ డిస్‌‌ప్లేతో బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!

Best Phones

Updated On : August 27, 2025 / 8:28 PM IST

Best Phones : కొత్త స్మార్ట్ ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రస్తుతం మార్కెట్లో అనేక స్మార్ట్ ఫోన్లు లభ్యమవుతున్నాయి. బిగ్ డిస్ ప్లే, గేమింగ్ (Best Phones) చిప్ సెట్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, భారీ బ్యాటరీతో అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అద్భుతమైన డిస్కౌంట్ ఆప్షన్లతో పొందవచ్చు, ఆగస్టు 2025లో రూ. 20 వేల బడ్జెట్ లోపు అమోలెడ్ డిస్ ప్లే కలిగిన ఫోన్లలో ఏదైనా ఒకటి కొనుగోలు చేయొచ్చు. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు.

1. శాంసంగ్ గెలాక్సీ M35 5G :
శాంసంగ్ గెలాక్సీ M35 5G ఫోన్ 6.6 అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్‌తో FHD+ రిజల్యూషన్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌ కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ అమర్చి ఉంది. హై-ఎండ్ టాస్కులను ఎలాంటి లాగ్ సమస్యలు లేకుండా BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి బిగ్ గేమ్స్ ఆడవచ్చు.

ఈ ఫోన్ 6000mAh లాంగ్-లాయింగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ OISతో 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్, 2MP మాక్రో లెన్స్‌ పొందవచ్చు. అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేయొచ్చు. భారత మార్కెట్లో ఈ శాంసంగ్ ఫోన్‌ దాదాపు రూ. 16,999 నుంచి రూ.18,999 మధ్య కొనుగోలు చేయొచ్చు.

Read Also : Best Samsung Phones : శాంసంగ్ లవర్స్ కోసం రూ. 10వేల లోపు ధరలో టాప్ 3 శాంసంగ్ ఫోన్లు ఇవే.. ఏది కొంటారో మీఇష్టం..!

2. నథింగ్ ఫోన్ 1 5G :

సీఎంఎఫ్ నథింగ్ ఫోన్ 1 5G మోడల్ 6.67 అమోల్డ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ కూడా పొందవచ్చు. నేరుగా సూర్యకాంతిలో కూడా ఈ ఫోన్‌ డిస్ ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రాసెసర్‌తో వస్తుంది. గేమింగ్ ప్రాసెసర్ ఎలాంటి సమస్య లేకుండా ఎక్కువ గంటలు గేమ్స్ ఆడుకోవచ్చు.

ఈ ఫోన్‌లో 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh లాంగ్-లాయింగ్ బ్యాటరీ కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15పై నథింగ్ OS 3.2పై రన్ అవుతుంది. చాలా క్లీన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ అందిస్తుంది. ఈ ఫోన్‌ కొనుగోలుకు దాదాపు రూ. 14,199 నుంచి రూ. 15,999 ఖర్చు చేయాలి.

3. రెడ్‌మి నోట్ 14 SE 5G :
రెడ్‌మి నోట్ 14 SE 5G ఫోన్ 6.67 అంగుళాల అమోల్డ్ స్క్రీన్, 120Hz సూపర్ స్మూత్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5110mAh లాంగ్ బ్యాటరీ కలిగి ఉంది. మీ ఫోన్‌ను కేవలం గంటలో ఛార్జ్ చేస్తుంది. ఈ బ్యాటరీతో ఒక రోజు బ్యాటరీ బ్యాకప్‌ పొందవచ్చు. ఈ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్‌తో వస్తుంది.

గేమ్స్ ఆడే సమయంలో మల్టీ టాస్కింగ్ కోసం అద్భుతైన పర్ఫార్మెన్స్ అందిస్తుంది. ఈ రెడ్‌మి ఫోన్ వివిధ ర్యామ్, స్టోరేజీ కాన్ఫిగరేషన్లలో వస్తుంది. ఇందులో 6GB లేదా 8GB ర్యామ్, 128GB లేదా 256GB స్టోరేజీ ఆప్షన్లు ఉన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా విస్తరించవచ్చు. ఈ ఫోన్‌ను 6GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌ రూ. 14,999 ధరకు కొనుగోలు చేయొచ్చు.