×
Ad

9/11 Terror Attack : 20ఏళ్ల తర్వాత.. ఎప్పటికీ మర్చిపోలేని 9/11 దాడుల భయానక దృశ్యాలు!

అదో భయానక ఘటన.. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. 20 సంవత్సరాల క్రితం.. సెప్టెంబర్ 11, 2001న 9/11 దాడుల నాటి ఘటన ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది.

1/27
ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడి తరువాత న్యూయార్క్‌లో పొగ కమ్మేసింది. ఉగ్రదాడిలో దాదాపు 3,000 మంది మరణించారు. లెక్కలేనన్ని మంది గాయపడ్డారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌ను శాశ్వతంగా మార్చింది.
2/27
మాన్హాటన్‌లోని పాదచారులకు మంగళవారం, సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి వచ్చే పొగ చూస్తున్నారు. ఈ సంఘటన దేశంలోని సుదీర్ఘ యుద్ధానికి నాంది పలికింది. అఫ్ఘానిస్తాన్‌కు అమెరికా బలగాలను వేగంగా మోహరించేలా చేసింది.
3/27
సెప్టెంబర్ 11, 2001 (మంగళవారం)నాడు న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్ నుంచి మంటలు, పొగలు ఎగసిపడుతున్న దృశ్యం.
4/27
సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూలిపోయినప్పుడు గాల్లో ధూళితో ప్రజలు తమ ముఖాలను ఇలా కప్పుకున్నారు.
5/27
న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, సెప్టెంబర్ 11, 2001 కూలిపోయిన తర్వాత బ్రూక్లిన్ నుంచి చూసినట్లుగా మాన్హాటన్‌లోని భవనాల నుంచి పొగ కమ్ముతోంది.
6/27
WTCపై దాడి జరిగిన అరగంటలోపు.. డల్లెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఒక అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరింది. ఇది పెంటగాన్ పశ్చిమ భాగంలో క్రాష్ అయింది. ఇక్కడ US స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ఉంది.
7/27
సెప్టెంబర్ 11, 2001న వాషింగ్టన్‌లో పెంటగాన్ వెలుపల పెంటగాన్ ఉద్యోగికి సాయుధ అధికారి ఓదార్చిన దృశ్యం
8/27
వాషింగ్టన్‌లోని పెంటగాన్ వద్ద ఒక భవనం నుంచి మంటలు, పొగలు ఎగసిపడుతున్నాయి. 9/11 దాడుల వెనుక సూత్రధారి అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ అని అమెరికా ప్రభుత్వం ఆరోపించింది. కొద్దిసేపటి తర్వాత అమెరికా అఫ్ఘానిస్తాన్‌పై బాంబు దాడులు జరిపింది.
9/27
ఉగ్రవాదుల దాడి తరువాత న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రెండు టవర్లు కూలిపోయిన కొద్ది సేపటికే శిథిలాల నుంచి ఒకరిని భద్రతా బలగాలు రక్షించిన దృశ్యం.
10/27
సెప్టెంబర్ 11, 2001, న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాలిపోతుండగా ఇద్దరు మహిళలు ఒకరినొకరు పట్టుకుని బోరున విలపిస్తున్నారు. ఆ రోజు ప్రపంచ వాణిజ్య కేంద్రం, పెంటగాన్ నుంచి 33వేల లేదా అంతకంటే ఎక్కువ మందిని ఖాళీ చేయించారు.
11/27
ప్రపంచ వాణిజ్య కేంద్రం దక్షిణ టవర్ నుంచి సెప్టెంబర్ 11, 2001 రోజున ప్రజలు అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యం.
12/27
న్యూయార్క్, సెప్టెంబర్ 11, 2001లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉన్న ప్రదేశంలో చెత్త కుప్పల మధ్య అగ్నిమాపక సిబ్బంది వెళ్తున్న దృశ్యం.
13/27
రెండు వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లు కూలిపోవడంతో ప్రజలు న్యూయార్క్ బ్రూక్లిన్ వంతెనపై మాన్హాటన్ నుంచి బ్రూక్లిన్ వరకు నడిచి వెళ్తున్నారు.
14/27
న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలో సెప్టెంబర్ 11, 2001 సమీపంలో ప్రజలంతా భయంతో పరుగులు పెడుతున్న దృశ్యం.
15/27
రెండో టవర్, సెప్టెంబర్ 11, 2001 నుంచి మంటలు ఎగసిపడుతున్నాయి. శిధిలాల్లో నుంచి వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్‌లలోని ఒకదాని నుంచి పొగలు కమ్ముకున్నాయి.
16/27
న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అవశేషాలు శిథిలాల మధ్య ఒరిగిన స్థితిలో ఇలా కనిపిస్తున్నాయి.
17/27
సెప్టెంబర్ 11, 2001న న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్ నుంచి ఒక వ్యక్తి బయటకి వస్తుండగా.. ఎడమవైపున భవనం నుంచి పొగ, మంటలు ఎగసిపడుతున్న దృశ్యం..
18/27
న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ధ్వంసమైన ములియన్స్, స్ట్రట్స్ కింద అగ్నిమాపక సిబ్బంది పని చేస్తున్న దృశ్యం.
19/27
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై 9/11 దాడుల నుంచి బయటపడిన వ్యక్తి.. న్యూయార్క్‌లో శుక్రవారం, ఆగస్టు 6, 2021, 9/11 ట్రిబ్యూట్ మ్యూజియంలో ప్రదర్శనలో ఉంచిన చనిపోయిన వారి ఫొటోలను చూస్తున్న దృశ్యం.
20/27
ఆగష్టు 26, 2021 రోజున న్యూయార్క్ నగరంలో 9/11 ట్రిబ్యూట్ మ్యూజియంలో విద్యార్థి నివాళులు..
21/27
2021 ఆగస్టు 6 రోజున.. 9/11 ట్రిబ్యూట్ మ్యూజియంలో అమెరికా, న్యూయార్క్ సిటీలో ఆనాటి ట్విన్ టవర్ల ఫోటోను ఓ వ్యక్తి ఇలా పట్టుకున్నాడు.
22/27
అమెరికాలోని న్యూయార్క్ ట్విన్‌ టవర్స్(వరల్డ్ ట్రేడ్ సెంటర్)పై 9/11 ఉగ్రదాడి జరిగి శనివారం (సెప్టెంబర్-11,2021)నాటికి 20 ఏళ్లు పూర్తవుతుంది.
23/27
శిథిలావస్థలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లలో చిక్కుకున్నవారి ప్రాణాలను కాపాడేందుకు వెళ్లిన 343 అగ్నిమాపక సిబ్బందిని కూడా న్యూయార్క్ అగ్నిమాపక శాఖ కోల్పోయింది.
24/27
ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ అల్-ఖైదాకు చెందిన 19 మంది హైజాకర్లతో సహా దాదాపు 3వేల మంది ఈ ఉగ్రదాడుల్లో మరణించారు. అమెరికా గడ్డపై అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా చరిత్రలో నిలిచింది.
25/27
9/11 ఉగ్రదాడుల నేపథ్యంలో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్‌.. ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ తాలిబాన్ ఆశ్రయం కల్పించిన అల్-ఖైదా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు అఫ్ఘానిస్తాన్‌కు అమెరికా సైనికులను మోహరించారు.
26/27
ఆ తర్వాత జరిగిన 20 సంవత్సరాల యుద్ధం ఆగస్ట్ 31న ముగిసింది. ఇప్పటి బైడెన్ పరిపాలనలో అప్ఘాన్ లో అమెరికా మొత్తం సైనిక సిబ్బందిని ఉపసంహరించుకుంది.
27/27
ట్విన్ టవర్లు ఒక్కసారిగా కుప్పకూలడంతో భయంతో అక్కడివారంతా బయటకు పరుగులు తీస్తున్న దృశ్యం.