Telugu » Photo-gallery » Ap Deputy Cm Pawan Kalyan Meets Old Women Indla Nageswaramma In Ippatam Village Tour Photos Goes Viral Sy
Pawan Kalyan : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్.. ఆ బామ్మను కలిసి, ఆమె కాళ్ళను మొక్కి.. ఫొటోలు వైరల్..
వైసీపీ హయాంలో ఇప్పటం గ్రామంలో జనసేన ఆవిర్భావ సభకు భూములు ఇచ్చారనే కక్షతో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తల ఇళ్లు కూల్చివేశారని ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో పవన్ ఈ గ్రామంలో పర్యటించి బాధితులకు ధైర్యం చెప్పారు. ఆ సమయంలో వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మ ఎన్నికల్లో గెలిచాక మళ్లీ మా గ్రామానికి రావాలని కోరగా వస్తానని పవన్ హామీ ఇచ్చి నేడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటం గ్రామంలో పర్యటించి నాగేశ్వరమ్మని కలిశారు. పవన్ ను చూసిన వెంటనే నాగేశ్వరమ్మ భావోద్వేగానికి గురవ్వగా పవన్ ఆమెకు పాదాభివందనం చేసి ఆలింగనం చేసుకున్నారు. ఆమె ఆర్ధిక పరిస్థితి తెలుసుకున్న పవన్ 50వేల నగదు అందించి, నెలనెలా 5వేలు ఇస్తానని హామీ ఇచ్చి మనవడి చదువు కోసం లక్ష, మూడో కొడుకు ట్రీట్మెంట్ కోసం 3 లక్షలను పవన్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఆ వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మను కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.