Apple iPhone 17 : వారెవ్వా.. కిర్రాక్ ఆఫర్.. లేటెస్ట్ ఐఫోన్ 17 కేవలం రూ. 14వేలకే..? ఈ స్మార్ట్ ట్రిక్‌తో ఇలా కొనేసుకోండి..!

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 అతి చౌకైన ధరకే ఎలా సొంతం చేసుకోవాలి? ఈ డీల్ పొందాలంటే ఏం చేయాలి? లేటెస్ట్ ఐఫోన్ తక్కువ ధరకే ఎలా వస్తుందంటే?

1/7
Apple iPhone 17 : ఆపిల్ లవర్స్ కు పండగ చేస్కోండి.. అతి తక్కువ ధరకే లేటెస్ట్ ఐఫోన్ 17 మోడల్ కొనే అవకాశం.. మీరు ఐఫోన్ 17 కొనాలనుకుంటే.. ఇదే బెస్ట్ టైమ్.. ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్‌ను సెప్టెంబర్ 9, 2025న లాంచ్ చేసింది.
2/7
అయితే, ఈ ఐఫోన్ మోడల్ బేస్ వేరియంట్ లాంచ్ ధర రూ. 82,900 ఉంటుంది. కానీ, ఈ ఐఫోన్‌ను అతి చౌకైన ధరకే సొంతం చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. ఈ ఐఫోన్‌ను కేవలం 14వేలకు కొనుగోలు చేయొచ్చు. ఇదేలా సాధ్యమంటే.. ఈ స్మార్ట్ ట్రిక్ ద్వారా తగ్గింపు ధరకే పొందవచ్చు.
3/7
ఆపిల్ ఐఫోన్ 17 సరికొత్త A19 చిప్‌తో వస్తుంది. స్పీడ్ పర్ఫార్మెన్స్ మెరుగైన సామర్థ్యాన్ని అందిస్తుంది. ఫ్రంట్ కెమెరాలో సెంటర్ స్టేజ్ ఫీచర్‌తో బెస్ట్ కెమెరా సెటప్‌ పొందవచ్చు. ఐఫోన్ 17 మోడల్ అతి చౌకైన ధరకే ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/7
కేవలం రూ. 14వేలకే ఐఫోన్ 17 ఇలా : భారత మార్కెట్లో ఐఫోన్ 17 బేస్ వేరియంట్ ధర రూ. 82,900కు లాంచ్ అయింది. గత ఐఫోన్ల మాదిరిగా కాకుండా మీరు 128GB స్టోరేజ్ ఆప్షన్‌కు బదులుగా బేస్ వేరియంట్‌లో 256GB పొందవచ్చు. ఈసారి ఆపిల్ ఐఫోన్ 17 బేస్ వేరియంట్‌లో ప్రోమోషన్, ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే కలిగి ఉంది. మీరు ఐఫోన్ 17 మోడల్ కేవలం రూ. 14వేలకు కొనుగోలు చేయొచ్చు.
5/7
ఆపిల్ ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో పాత ఫోన్‌ ఎక్స్చేంజ్ కొనుగోలుపై రూ. 64వేలు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్ లేదా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో అదనంగా రూ. 5,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. తద్వారా ఐఫోన్ 17 కేవలం రూ. 14వేలకే పొందవచ్చు. అయితే, మీరు గరిష్టంగా రూ. 64వేలు ట్రేడ్-ఇన్ డిస్కౌంట్‌ను ఎక్కువగా ఐఫోన్ 16 ప్రో మాక్స్ 1TB వేరియంట్‌పై పొందవచ్చు. అయితే, మీ ఫోన్ వాల్యూను చెక్ చేసిన తర్వాత మాత్రమే బెస్ట్ డిస్కౌంట్ పొందవచ్చు.
6/7
ఐఫోన్ 17 ఫోన్ ఫీచర్లు : కొత్త ఐఫోన్ 17 ఫీచర్ల విషయానికి వస్తే.. 6.3-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేతో వస్తుంది. స్మూత్ స్క్రోలింగ్, యానిమేషన్ల కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ A19 చిప్‌తో రన్ అవుతుంది. హై-ఎండ్ వర్కింగ్ కోసం అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అందిస్తుంది. మీరు ఈ ఐఫోన్‌లో ఎలాంటి లాగ్‌ ఉండదు. అంతేకాదు.. బ్యాక్ సైడ్ డ్యూయల్ 48MP కెమెరా సెటప్‌ కలిగి ఉంది.
7/7
అయితే ఫ్రంట్ సైడ్ ఫొటోలు, వీడియో కాల్స్ కోసం సెంటర్ స్టేజ్ ఫీచర్‌తో 18MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది. ఈ ఐఫోన్‌తో మీరు 30 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ పొందవచ్చు. మ్యాగ్‌సేఫ్, Qi2 అప్లియన్సెస్ ఉపయోగించి 40-వాట్ ఛార్జింగ్, 25-వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది.